ఓటీటీలోకి వచ్చేసిన ‘భగవంత్‌ కేసరి’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

-

నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఆయన ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన మూవీ భగవంత్ కేసరి ఓటీటీలోకి వచ్చేసింది. కాజల్, శ్రీలీల కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా దసరాకు థియేటర్లలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక బాలయ్యకు ఈ సినిమా సూపర్ కలెక్షన్లను తీసుకొచ్చింది. థియేటర్లలో బాక్సులు కలెక్షన్స్ బద్ధలు కొట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో దుమ్ము రేపేందుకు వచ్చేసింది.

Tentative OTT release date of Bhagavanth Kesari is here

అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో బాలయ్య యాక్షన్, డైలాగ్స్.. అనిల్ రావిపూడి టేకింగ్.. కాజల్ గ్లామర్.. శ్రీలీల నటన ప్రేక్షకులను ఫిదా చేశాయి. ముఖ్యంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి బాలయ్య చిన్న పిల్లలకు వివరించే సీన్ ఈ సినిమాకే హైలైట్​గా నిలిచిందని చెప్పొచ్చు. ఇక బాలయ్య- శ్రీలీల మధ్య తండ్రీ కూతుళ్ల బంధం, ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టి పడేశాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్​ను ఈ సినిమా చూసి ఎంచక్కా ఎంజాయ్ చేసేయండి మరి.

Read more RELATED
Recommended to you

Latest news