తెలంగాణలో భారతీయుడు2 మూవీ టికెట్ల రేట్లు పెంపు.. ఎంతంటే..?

-

సుమారు 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సినిమాలోని పాటలు ఇప్పటికీ చాలా మందికి హాట్ ఫేవరెట్. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఒక కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలబడింది. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో మనీషా కొయిరాలా హీరోయిన్ గా నటించగా కస్తూరి వంటి వాళ్ళు ఇతర పాత్రల్లో నటించారు. అలాంటి సినిమాకి సుమారు 28 ఏళ్ల తర్వాత భారతీయుడు 2 అనే పేరుతో ఒక సీక్వెల్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, సముద్రఖని, ఎస్ జె సూర్య వంటి వాళ్ళు ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు.

తాజాగా భారతీయుడు 2 జులై 12న ప్రేక్షకుల ముందుకొస్తుంది.  ఈ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది. మల్టీప్లెక్స్ లో 75 రూపాయలతో పాటు సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి  ఇచ్చింది. ఈ మధ్యనే రేవంత్ రెడ్డి సినిమా టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవాలంటే యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ చేయాలని  హీరో, హీరోయిన్లతో వీడియోలు రిలీజ్ చేయించాలని కోరారు. అందులో భాగంగా ఈ సినిమాలో నటించిన కమల్ హాసన్, సిద్ధార్థ, సహ సముద్ర ఖని వంటి వాళ్ళు డ్రగ్స్ వినియోగం తప్పంటూ వీడియో రిలీజ్ చేశారు. అదేవిధంగా ఉదయాన్నేఎక్స్ ట్రా షో వేసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది ప్రభుత్వం. తెలంగాణలో ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news