భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను 2026 నాటికి నిర్మిస్తాం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

-

ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు పౌర విమాన యాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతీ ఎయిర్ ఫోర్టును సందర్శిస్తూ.. అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2026 నాటికి నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్‌మోహన్‌నాయుడు తాజాగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం నియోజకవర్గం ఎంపీగా ఉన్న పౌరవిమానయాన శాఖ మంత్రి, రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ స్థలాన్ని సందర్శించి, దాని పురోగతిని పరిశీలించారు.

“ఈరోజు భోగాపురం ఇంట్ (అంతర్జాతీయ) విమానాశ్రయంలో జరుగుతున్న నిర్మాణాన్ని పరిశీలించాను. టెర్మినల్, రన్‌వే, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) టవర్ పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించాను. అంతర్జాతీయ ప్రమాణాలతో అగ్రశ్రేణి విమానాశ్రయంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నాం” అని మంత్రి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news