పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. “భీమ్లా నాయక్” ఓటీటీ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ భీమ్లానాయక్’. పవన్ కళ్యాన్ స్టామినాను మరోసారి నిరూపిస్తూ.. భారీగా కలెక్షన్లను కొల్లగొడుతోంది. మళయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రిమేక్ గా వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైంది. రానా, నిత్యామీనన్, సంయుక్త మీనన్ లీడ్ రోల్స్ వచ్చిన ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ కు పండగా తీసుకువచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల రికార్డ్ క్రియేట్ చేస్తోంది.

ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా… వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరినట్టు సమాచారం అందుతోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ లో విడుదల అవుతుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. చాలామంది కరోనా కారణంగా థియేటర్లలోకి వెళ్లలేదు.

దీంతో ఓటీటీ లోనైనా సినిమాను చూసేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటిటి డేట్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు. మార్చి చివర్లో అంటే ఉగాది కంటే ముందే ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోందని సమాచారం మాత్రం అందుతోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.