బిగ్ బాస్ క్రేజ్ వాడేస్తున్న సంపూ

-

బిగ్ బాస్ సెకండ్ సీజన్ ముగింపు రావడంతో ఇప్పుడు అందరి దృష్టి బిగ్ బాస్ 2 టైటిల్ ఎవరు విన్ అవుతారన్న ఎక్సైట్ మెంట్ అందరికి ఏర్పడింది. నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 లో ప్రస్తుతం ఆరుగురు కంటెస్టంట్స్ ఇంట్లో ఉన్నారు. ఎప్పటిలానే రానున్న ఆదివారం ఒకరు ఎలిమినేట్ అవుతారా లేక ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

అయితే బిగ్ బాస్ మీద హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్న ఈ టైంలో బిగ్ బాస్ సీజన్ 1 టీం రీ యూనియన్ అయ్యే అవకాశం ఏర్పరిచాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. సంపూర్ హీరోగా వస్తున్న కొబ్బరిమట్ట సినిమా ఆడియో రిలీజ్ కు బిగ్ బాస్ టీం అందరిని ఆహ్వానిస్తున్నాడు. మొదటి సీజన్ లో కంటెస్టంట్స్ గా ఉన్న 15మంది కలుస్తున్నారన్నమాట.

ఇది కచ్చితంగా ప్రస్తుత సీజన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాదు అక్కడకు వచ్చిన వారిని ఈ సీజన్ విన్నర్ గా ఎవరికి టైటిల్ గెలిచే ఛాన్స్ ఉందని చెబుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version