బిగ్ బాస్-3 హోస్ట్ కాదు.. కంటెస్టంట్స్ లిస్ట్ లీక్

-

స్టార్ మా ప్రెస్టిజియస్ గా రూపొందిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో మూడవ సీజన్ కు రంగం సిద్ధం అవుతుంది. బిగ్ బాస్ మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేశాడు. ఇక రెండో సీజన్ లో ఎన్.టి.ఆర్ చేసే వీలు కుదరక నానిని హోస్ట్ గా దించారు. తారక్ అంత కాకున్నా నాని కూడా షోని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇక బిగ్ బాస్ 3 హోస్ట్ ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.. అయితే హోస్ట్ సంగతి పక్కనపెడితే బిగ్ బాస్ 3 కంటెస్టంట్స్ లిస్ట్ బయటకు వచ్చింది.

సోషల్ మీడియాలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3కి సంబందించిన కంటెస్టంట్స్ లిస్ట్ ఒకటి వైరల్ గా మారింది. 15 మంది కంటెస్టంట్స్ తో బిగ్ బాస్ సీజన్ 3 మొదలు కానుందట. సీజన్ త్రీలో మొదటి రెండు సీజన్ లలో లానే హీరోలు, హీరోయిన్స్ తో పాటుగా సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన ఒకరు.. సింగర్స్ ఒకరు.. ఇలా సమానంగా సెలెక్ట్ చేశారట.

మరి బయటకు వచ్చిన ఆ లిస్ట్ ఏంటో మారూ చూడండి.. అయితే ఇదే ఫైనల్ కంటెస్టంట్స్ లిస్ట్ అని మాత్రం చెప్పలేం..

యాంకర్ జాహ్నవి

వెబ్ మీడియా (సోషల్ మీడియా) జ్యోతి

హీరోయిన్ శోభిత ధూళిపాళ

జబర్దస్త్ పొట్టి నరేష్

యాంకర్ ఉదయభాను

జాకీ టివి ఆర్టిస్ట్

హీరో వరుణ్ సందేశ్

హీరోయిన్ రేణు దేశాయ్

నటుడు చైతన్య కృష్ణ

హీరో మనోజ్ నందన్

నటుడు కమల్ కామరాజు

యానక్ర్ అంద్ యాక్ట్రెస్ నాగ పద్మిని

డ్యాన్స్ మాస్టర్ రఘు

సింగర్ హేమ చంద్ర

హీరోయిన్ గద్దె సింధూర

Read more RELATED
Recommended to you

Latest news