బిగ్ బాస్-3 ఎన్.టి.ఆర్ నో.. ఆప్షన్ అతనొక్కడే..!

బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ ఎవరన్న దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అందరు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సీజన్ 3 హోస్ట్ గా కన్ఫాం అనేశారు. కాని ఆర్.ఆర్.ఆర్ సినిమాకు 10 నెలలు రాసిచ్చిన తారక్ బిగ్ బాస్ చేయలేనని చెప్పాడట. బిగ్ బాస్ సీజన్ 3 తారక్ కోసం బాగా ట్రై చేయగా అతను ససేమీరా అనడంతో ఇప్పుడు హోస్ట్ గా ఎవరిని తీసుకోవాలా అనే సందిగ్ధంలో పడ్డారు బిగ్ బాస్ నిర్వాహకులు.

అయితే వారికి కనిపిస్తున్న ఒకే ఒక్క ఆప్షన్ కింగ్ నాగార్జున అని తెలుస్తుంది. ఆల్రెడీ బుల్లితెర మీద మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా అలరించింది నాగ్ అక్కడ అదరగొట్టాడు. బిగ్ బాస్ హోస్ట్ గా స్టార్స్ ఎవరు సుముఖంగా లేరని తెలుసి నాగార్జునని కన్ఫాం చేసేస్తున్నారట. దాదాపు నాగ్ బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా ఫిక్స్ అయినట్టే అట. ఎం.ఈ.కే రెండు సీజన్స్ లో అలరించిన నాగ్ బిగ్ బాస్ హోస్ట్ గా ఎలా తన సత్తా చాటుతాడో చూడాలి.