స్మార్ట్ కిడ్.. పిల్లలను ఇలా మోసం చేయొచ్చా? వీడియో

తమ పిల్లలు విజయం సాధించినా.. విజయం సాధించకపోయినా.. మంచి మార్గం పట్టినా.. చెడు మార్గం పట్టినా అది పూర్తిగా తల్లిదండ్రులదే బాధ్యత. తల్లిదండ్రులు పిల్లలను ఎలా పెంచితే వాళ్లు అలా తయారవుతారు.. అనడానికి ఈ వీడియోనే నిదర్శనం..

ఇది స్మార్ట్ ఫోన్ల యుగమని అందరికీ తెలిసిందే. చిన్న పిల్లల దగ్గర్నుంచి పండు ముసలి వరకు అంతా స్మార్ట్ ఫోన్ కు బానిసలే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ.. చిన్నపిల్లలు స్మార్ట్ ఫోన్ కు బానిస అయితే అది వాళ్ల ఎదుగుదల, చదువు, ఇతరత్రా వాటిలో ప్రభావం చూపిస్తుంది. వాళ్లు ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. అందుకే.. పిల్లలకు స్మార్ట్ ఫోన్ ను అలవాటు చేయొద్దంటారు పెద్దలు.

కానీ.. ఈ వీడియో చూడండి. ఆ చిన్నారి కుటుంబ సభ్యులే ఆ చిన్నారికి స్మార్ట్ ఫోన్ ఇచ్చి ఆడుకోమంటూ చెబుతున్నారు. ఆ చిన్నారి స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటుండగా… ఆ చిన్నారికి గుండు కొట్టిస్తున్నారు. తనకు తెలియకుండా ఈ పని చేస్తున్నారన్నమాట.

పిల్లలకు గుండు అనగానే భయపడతారు. కానీ.. వాళ్లను ఇలా మోసం చేసి స్మార్ట్ ఫోన్ కు బానిసను చేసి వాళ్లను వశం చేసుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లలు స్మార్ట్ ఫోన్ కు ఎంతలా బానిసలవుతున్నారో చెప్పేందుకు ఈ వీడియోనే బెస్ట్ ఉదాహరణ.