దర్బార్ సినిమాకు బిగ్ షాక్…!

-

సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా, ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన దర్బార్ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. రజని, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో భారీ అంచనాలే ఏర్పడ్డాయి ఈ సినిమా మీద. దీనితో సినిమా విడుదలకు ముందే భారీ వ్యాపారం జరిగింది. ఇక రజనికి అన్ని భాషల్లో మంచి క్రేజ్ ఉండటంతో మార్కెట్ భారీగా జరిగింది.

అయితే ఈ సినిమా మీద మిశ్రమ స్పందన వస్తుందని సిని వర్గాలు అంటున్నాయి. 70 ఏళ్ళ వయసులో రజని కాంత్ నటనకు అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. పోలీస్ ఆఫీసర్ గా రజని నటన విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే దర్బార్ విడుదలై కొన్ని గంటలు కూడా కాక ముందే, ‘తమిళ్ రాకర్స్’ పైరసీ చేసి దర్బార్ సినిమా మొత్తాన్ని ఆన్‌లైన్‌లో లీక్ చేయడంతో అభిమానులు షాక్ అయ్యారు.

భాష ఏదైనా సరే దూకుడుగా ఉండే తమిళ రాకర్స్ ఏ సినిమా విడుదలైనా సరే ఆన్లైన్ లో గంటల వ్యవధిలోనే అప్లోడ్ చేసి షాక్ ఇస్తూ ఉంటుంది. ఎన్నో సినిమాలు తమిళ రాకర్స్ దెబ్బకు బలైన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభించింది. సంక్రాంతిని రజని గ్రాండ్ గా స్టార్ట్ చేసాడని అంటున్నారు తెలుగు ప్రేక్షకులు.

Read more RELATED
Recommended to you

Latest news