వావ్; ఇది కదా క్యాచ్ అంటే…!

-

బిగ్‌బాష్ లీగ్‌లో ఎప్పుడూ ఏదొక సంచలనం నమోదు అవుతూనే ఉంటుంది. బ్యాటింగ్ లో వింతలు బౌలింగ్ లో సంచలనాలు, ఫీల్డింగ్ లో ఆశ్చర్యాలు జరుగుతూ ఉంటాయి. ఒక దాన్ని మించిన సంచలనం మరొకటి అన్నమాట. తాజాగా ఒక మ్యాచ్ లో ఇలాంటి సంచలనమే ఒకటి నమోదు అయింది. ఈ టోర్నీలో భాగంగా బ్రిస్బేన్ హీట్, హాబర్ట్ హర్రికేన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక క్యాచ్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

హోబర్ట్ కెప్టెన్ మ్యాథ్యూ వేడ్‌ 14వ ఓవర్ ఐదో బంతిని సిక్స్ ఆడే ప్రయత్నం చేసాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న మ్యాట్ రెన్షా గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు కాని అనూహ్యంగా అదుపు తప్పి బౌండరి లోపలి వెళ్ళే పరిస్థితి వచ్చింది. దీంతో బంతిని గాల్లో ఎగరవేసాడు, కాని బంతి అక్కడే పడే అవకాశం ఉన్నట్టు కనపడటంతో గాల్లోకి యెగిరి బయటకు నెట్టాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న,

టామ్ ఆ బంతిని అందుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు అది అవుటా కాదా అనే విషయం అర్ధం కాక ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ కి ఇవ్వడంతో ఫీల్డర్ గాల్లోకి యెగిరి ఉండటంతో అది అవుట్ అన్నారు. ఇక క్రికెట్ మక్కా లార్డ్స్ కూడా దీనిపై స్పందిస్తూ అది అవుట్ అని తేల్చింది. ఎంసీసీ క్రికెట్ నిబంధన 19.5 ప్రకారం అది అవుట్ అని చెప్తూ గ్రేట్ క్యాచ్ అని కొనియాడింది.

Read more RELATED
Recommended to you

Latest news