బ్రేకింగ్ న్యూస్ : నాగబాబుకి పెద్ద షాక్ !

-

మెగా బ్రదర్ నాగబాబు కొన్ని రోజుల క్రితం జబర్దస్త్ స్థో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగబాబు మరో లీడింగ్ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ లో జబర్దస్త్ తరహాలోనే అదిరింది అనే షో ప్రారంభించారు. నాగబాబు జడ్జిగా మరో కొత్త కామెడీ షో అనగానే మంచి పబ్లిసిటీ వచ్చింది. కానీ చెప్పాలంటే కంటెంట్ పరంగా ఈ షో జబర్దస్త్ స్థాయిలో నిలవ లేకపోయింది. నిజానికి జబర్దస్త్ దర్శకులు నితిన్, భరత్ లే ఈ షోకు దర్శకులు అయినా చానాళ్ళ పాటు ఈ షోకి ఆదరణ దక్కలేదు.

ఇప్పుడిప్పుడే ఈ అదిరింది షోకు ఆదరణ పెరుగుతోంది. ఇప్పుడు ఈ షోకి యాంకర్స్ గా భానుశ్రీ, రవిలు ఉన్నారు. కానీ అనుకోకుండా యాంకర్ రవి ఈ టీమ్ కి షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన ఈ షో నుండి బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఎందుకైనా మంచిదని శ్రీముఖిని లైన్ లో పెట్టారట. ఈ విషయం తెలిసి భానుశ్రీ కూడా ఈ షో నుండి బయటకు వెళ్లేందుకు రెడీ అయిందని తెలుస్తోంది. నిజానికి ముందు ఈ షోకి సమీరా యాంకరింగ్ చేసింది. ఎందుకో ఏమో ఆమెను మార్చి భానుశ్రీని ఎంటర్ చేశారు. ఇప్పుడు తాను తెచ్చిన వాళ్ళే తనకి హ్యాండ్ ఇవ్వడం నాగబాబుకి భారీ షాక్ అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news