`సైరా`కు షాక్.. షోల నిలిపివేత.. ఎందుకంటే..?

-

మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా` ప్ర‌తిష్టాత్మ‌కంగా అక్టోబ‌ర్ 2 గాంధీ జయంతి రోజున ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల అయింది. చిరంజీవి 151వ చిత్రంగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వ‌హించ‌గా.. రాంచ‌ర‌ణ్ నిర్మాతగా వ్యవహరించాడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు కెనడాలోని టొరొంటోలో బ్రేక్ పడింది. అక్కడ ఈ సినిమా ప్రదర్శనను రద్దు చేశారు. ఒంటారియోలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సినిమా ప్రదర్శితమవుతున్న ల్యాండ్‌మార్క్ సినిమాస్‌లోకి ప్రవేశించిన ఓ దుండగుడు ఒక్కసారిగా కత్తి బయటకు తీసి తెరను చించేశాడు.

అనంతరం ప్రేక్షకులపై పెప్పర్ స్ప్రే‌ను చిమ్మి ఉడాయించాడు. అలాగే విట్బీలోనూ ఇటువంటిదే మరో ఘటన జరిగింది. రెండు ఘటనలు ఒంటారియో ప్రావిన్స్‌లోనే జరిగాయి. సినిమా తెలుగులో ప్రదర్శితమవుతుండడంతో కావాలనే ఇలా చేశారని సమాచారం. ఇటువంటివే మరికొన్ని ఘటనలు జరిగాయి. ఓ ప్రాంతంలో జరిగిన ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడడమో, మరణించడమో జరిగిందని సమాచారం. దీంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం కావడంతో ముందు జాగ్రత్త చర్యగా షోలను నిలిపివేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version