బిగ్​బాస్ సీజన్-7 హోస్టుగా మళ్లీ మన్మథుడే

-

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్-7 త్వరలోనే వచ్చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సీజన్​కు సంబంధించి ఓ ప్రొమో విడుదలై ఆకట్టుకుంటోంది. అయితే సీజన్-7 హోస్టుగా ఎవరొస్తారో అని ఇన్నాళ్లూ బుర్రలు బద్ధలు కొట్టుకున్న ప్రేక్షకులకు ఈ ప్రోమో ద్వారా హోస్టు ఎవరో తెలిసిపోయింది. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో, ప్రోగ్రాం హోస్ట్​ అక్కినేని నాగార్జున కనిపించి ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ సారి రొటీన్​కు భిన్నంగా ఓ కొత్త కాన్సెప్ట్​తో రానున్నట్లు ఆయన ఓ హింట్ ఇచ్చారు. ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌’ అంటూ ఈ షో పై ఆడియన్స్​కు మరింత ఆసక్తి పెంచారు.

గత సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జున.. ఈ సీజన్​కు రాకపోవచ్చన్న వార్తలు సైతం నెట్టింట హల్​చల్​ చేశాయి. అయితే వాటన్నింటికి ఈ తాజా ప్రోమోతో చెక్​ పెట్టినట్లు అయ్యింది. మొద‌టి సీజ‌న్‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, రెండో సీజ‌న్‌కు నేచురల్​ స్టార్​ నాని హోస్ట్‌గా చేయ‌గా.. 3, 4, 5, 6 సీజన్లకు నాగార్జునే హోస్టుగా అలరించారు. ఇప్పుడు సీజన్-7​కు కూడా ఆయనే హోస్ట్​గా వచ్చి సందడి చేయనున్న విషయం కన్ఫార్మ్​ అయ్యింది.

 

Read more RELATED
Recommended to you

Latest news