స‌లార్ కోసం బిగ్‌బాస్ విన్న‌ర్‌.. ప్ర‌భాస్ మాస్ట‌ర్ స్కెచ్

-

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కు ఇప్పుడు నేష‌న‌ల్ వైడ్ ఫాలోయింగ్ వ‌చ్చేసింది. బాహుబ‌లితో ఇండియ‌న్ స్టార్ అయిపోయాడు మ‌న డార్లింగ్‌. దీంతో ఆ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు వ‌రుస‌గా ప్యాన్ ఇండియ‌న్ సినిమాల‌ను లైన్‌లో పెడుతున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని డైరెక్ట‌ర్ల నుంచి యాక్ట‌ర్ల వ‌ర‌కు అంద‌రినీ బాలీవుడ్ వారినే ఎంచుకుంటున్నాడు.

ఇప్పుడు స‌లార్‌, రాధేశ్యామ్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా స‌లార్ కోసం ప్ర‌త్యేకంగా బాలీవుడ్ హీరోయిన్ కృతి స‌న‌న్‌, అలాగే బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్‌జోహార్‌లు ప‌నిచేస్తున్నారు.

ఇప్పుడు బాలీవుడ్ బిగ్‌బాస్ 13సీజ‌న్ విన్న‌ర్ గా నిలిచిన సిద్ధార్థ్ శుక్లాను ఈ సినిమా కోసం వాడుతున్నాడు. దీంతో సినిమాకు క్రేజ్ తీసుకురావాల‌ని చూస్తున్నాడు ప్ర‌భాస్‌. సిద్ధార్థ్‌కు బిగ్‌బాస్‌తో మంచి క్రేజ్ వ‌చ్చింది. ఆయ‌న్ను తీసుకుంటే సినిమాకు బాలీవుడ్‌లో మంచి మార్కెట్ ఉంటుంద‌ని ప్ర‌భాస్‌టీం భారీ స్కెచ్ వేసింది. మ‌రి వారి స్కెచ్ ఎలా ప‌నిచేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news