లోపల నెగెటివిటీ.. బయట సింపతీ.. ట్రెండింగ్ లో ఆరియానా..

బిగ్ బాస్ లో ఈ వారం చాలా ఎక్కువగా వినిపించిన పేరేదైనా ఉందంటే అది ఆరియానాదే. కెప్టెన్ గా చేసినప్పటి నుండి హౌస్ మేట్స్ అందరిలో ఆమెపై నెగెటివిటీ పెరిగిపోయింది. అవినాష్ తప్ప ప్రతీ ఒక్కరూ ఆరియానా ని నామినేట్ చేసారంటే ఆమెకి హౌస్ లో నెగెటివిటీ ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో బయట ఆరియానాకి సింపతీ బాగా పెరుగుతుంది. అందరూ కలిసి ఒక్కరినే టార్గెట్ చేయడం వల్ల ఆరియానాకి బయట సింపతీ విపరీతంగా పెరుగుతుంది.

దానివల్ల ఓట్లు వచ్చి పడుతున్నాయి. ఆరియానాని సపోర్ట్ చేసే వాళ్ళే కాకుండా, సాధారణ ప్రేక్షకులు కూడా ఆరియానాని సపోర్ట్ చేస్తున్నారు. మరోపక్క ఆరియానాని తప్పు పట్టే వాళ్ళు ఉన్నప్పటికీ, మద్దతిస్తున్న వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది. ఒక్కరినే టార్గెట్ చేయడం ఎప్పుడూ సరికాదన్న విషయం ప్రతీ సీజన్లో కనిపిస్తూనే ఉంది. ముందు ముందు కూడా పరిస్థితి ఇలాగే ఉంటే ఆరియానాకి మద్దతు మరింత పెరగవచ్చు.