చెత్తతో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ప్రారంభం: కేటీఆర్

-

దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ మరో మెట్టు ఎక్కింది. చెత్తతో విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం చేసిన సుధీర్ఘ ప్రయత్నాలు ఫలించనున్నాయి. పదేళ్ల ఎదురుచూపులకు నేడు తెర పడుతోంది. హైదరాబాద్లో నిర్మించిన చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. జవహర్నగర్లో నిర్మించిన ప్లాంటును నవంబర్ 10 (మంగళవారం)న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.

ktr
ktr

గ్రేటర్ హైదరాబాద్ లో సేకరించే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ డంపింగ్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటువంటి ప్రాజెక్టులు ఇప్పటికే ఢిల్లీ, అహ్మదాబాద్‌ రాష్ట్రాల్లో ఉండగా.. దక్షిణ భారతదేశంలోని తెలంగాణలో మొదటి ప్లాంట్‌ మంగళవారం నుంచి అందుబాటులోకి రానున్నది. దీంతో విద్యుత్తులో తెలంగాణ మరో రికార్డు కొట్టిందనే చెప్పుకోవచ్చు.

జీహెచ్ఎంసీలో నిత్యం వెలువడే 6,300 మెట్రిక్‌ టన్నుల చెత్తను జవహర్ నగర్ లోని డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు. వ్యర్థాలు పేరుకుపోయి.. దుర్వాసన వెలువడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యాలకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణకు శ్రీకారం చుట్టాలని 2009లో నిర్ణయం తీసుకుంది.

తడి, పొడి చెత్తను వేరు చేసి శుద్ధి చేసిన చెత్తతో విద్యుదుత్పత్తి చేయొచ్చని ప్రభుత్వం భావించింది. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో సంస్థలు పనులు చేపట్టిన ముందుకు సాగలేదు. ఈ మేరకు జీహెచ్ఎంసీతో 25ఏళ్ల కాలానికి రాంకీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఎట్టకేలకు ప్లాంట్ ను పూర్తి చేసిన రాంకీ సంస్థ డంపింగ్ కేంద్రంలో రెండు నెలలుగా వేస్టేజ్ నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది. ఆగస్టు 20వ తేదీ నుంచి ప్లాంట్లో ట్రయల్రన్ నిర్వహిస్తున్నారు. ఈ ప్లాంటులో 19.8 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. ఈ వేస్టేజ్ ఎనర్జీ ప్లాంట్ దక్షిణ భారతదేశంలోనే మొట్ట మొదటిదని మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news