బిగ్ బాస్ షోలో రెచ్చిపోయిన దివి… నిర్వాహకులపై నెటిజన్ల విమర్శలు?

స్టార్ మా ఛానెల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో సీజన్ 4 గత సీజన్లకు భిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతోంది. ముక్కూ మొహం తెలియని కంటెస్టెంట్లు దీనికి సగం కారణం కాగా నిర్వాహకుల వైఫల్యం ఈ సీజన్ లో బాగా కనిపిస్తోంది. ఈ షోలో అద్భుతాలు జరుగుతాయని ప్రేక్షకులు ఆశిస్తే అది వాళ్ల తప్పే అవుతుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. బిగ్ బాస్ షో సండే ఎపిసోడ్ కూడా చప్పగానే సాగడం గమనార్హం.

నిన్నటి షోలో అమ్మ రాజశేఖర్, నాగార్జున జడ్జీలుగా అమ్మాయిలు, అబ్బాయిల మధ్య డ్యాన్స్ పోటీ జరిగింది. మెహబూబ్, మోనాల్ రంగస్థలంలోని జిగేల్ రాణి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేయగా మోనాల్ తో పోలిస్తే మెహబూబ్ కే ఎక్కువ మార్కులు పడ్డాయి. కరాటే కల్యాణి, సొహైల్ పెద్దపులి పాటకు డ్యాన్స్ వేయగా కల్యాణి తన డ్యాన్సింగ్ టాలెంట్ తో అదరహో అనిపించింది. దీంతో సొహైల్ తో పోలిస్తే కల్యాణికే ఎక్కువ పాయింట్లు వచ్చాయి.

హారిక, నోయల్ ఒకరిని మించి ఒకరు స్టెప్పులేశారు. అయితే వీరిద్దరికీ సమానంగా పాయింట్లు రావడం గమనార్హం. దేవీ నాగవల్లి, అభిజిత్ మధ్య డ్యాన్స్ పోటీ జరగగా దేవి కూడా స్టెప్పులేసి అద‌ర‌గొట్ట‌డంతో ఇంటి సభ్యులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. వీరలెవెల్లో దేవి డ్యాన్స్ వేయడంతో ఆమెకే ఎక్కువ మార్కులు పడ్డాయి. దివి, అఖిల్ మధ్య పోటోలో దివి రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. సూర్య‌కిర‌ణ్‌, లాస్య నాది నక్కిలీసు గొలుసు పాటకు డ్యాన్స్ వేయగా సూర్యకిరణ్ కు ఎక్కువ మార్కులు వచ్చాయి.

ఈ టాస్క్ లో అమ్మాయిలకు 91 పాయింట్లు, అబ్బాయిలకు 88 పాయింట్లు వచ్చాయి. అందరూ ఊహించిన విధంగానే సూర్యకిరణ్ ఔట్ అయ్యాడు. సూర్యకిరణ్ కు నాగ్ టాస్క్ ఇచ్చి జంతువుల ఫొటోల‌ను కంటెస్టెంట్ల‌తో పోల్చ‌మని చెప్పగా సూర్యకిరణ్ లాస్యను గాడిదతో, హారిక‌ను పాముతో, అరియానాను గుడ్ల‌గూబ‌తో, అమ్మ రాజ‌శేఖ‌ర్‌ను సింహంతో, క‌ళ్యాణిని కోతితో, దివిని తాబేలుతో, అభిజిత్‌ను పిల్లితో, సొహైల్ ను ఎలుకతో, గంగ‌వ్వ‌ను చీమ‌తో, దేవిని మొస‌లితో, మోనాల్‌ను నెమ‌లితో, సుజాతను కుక్క‌తో, మెహ‌బూబ్‌ను గ‌ద్ద‌తో, అఖిల్‌ను దున్న‌పోతుతో, నోయ‌ల్‌ను న‌క్క‌తో పోల్చాడు. దేవికి ఒకరోజంతా ఏ పని చేయాల్సిన అవసరం లేదని సూర్యకిరణ్ బిగ్ బాంబ్ వేశాడు.

ఆ తర్వాత ఈరోజుల్లో, బస్ స్టాప్ ఫేమ్ సాయి కుమార్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పెద్దగా పరిచయం లేని వాళ్లనే తీసుకోవడంతో షో నిర్వాహకులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి,