బిగ్‌బాస్ 4 : అవినాష్‌కు సీక్రెట్ టాస్క్‌!

-

బిగ్‌బాస్ సీజ‌న్ 4 కొంత న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్నా మొత్తానికి నెల‌రోజుల‌కు చేరుకుంది. ప్రారంభం నుంచి సేఫ్ గేమ్ ఆడుతున్న స‌భ్యులు క్ర‌మ‌క్ర‌మంగా జోరు పెంచారు. డ్యుయ‌ల్ రోల్ కాస్తా సింగిల్ రోల్‌కి వ‌చ్చేసింది. కానీ ఒక్క‌రిద్ద‌రు మాత్రం ఇంకా డ్యుయ‌ల్ రోల్ ప్లే చేస్తున్నారు. సోమ‌వారం నామినేష‌న్ రౌండ్‌లో అభిజిత్‌, అభిల్ సంవాదం పీక్స్‌కి చేరుకుని నువ్వా నేనా అన్న‌ట్టుగా ఫైన‌ల్‌కు చేరింది. ఈ వేడిని చ‌ల్లార్చేందుకు బిగ్‌బాస్ బిబీ హోట‌ల్ టాస్క్‌ని ఇంటి స‌భ్యుల‌కు ఇచ్చారు.


ఇందులో అవినాష్‌కి సీక్రెట్ టాస్క్‌ని ఇవ్వ‌డంతో గేమ్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. బీబీ హోట‌ల్ టీమ్ అభిజిత్‌, మోనాల్‌, దివి, నోయెల్‌, సుజాత‌, లాస్య‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, అఖిల్‌, అవినాష్‌, కుమార్ సాయి.  క‌స్ట‌మ‌ర్ల టీమ్‌లో సోహైల్‌, మెహ‌బూబ్‌, హారిక‌, అరియానా, గంగ‌వ్వ వున్నారు. గెస్ట్‌ల‌ని సంతృప్తి ప‌రిస్తే వాళ్లు స్టార్స్ ఇస్తారు. ఐదు స్టార్‌లు వ‌స్తే బిబి హోట‌ల్ అభిజిత్ టీమ్ హ‌స్త‌గ‌త‌మ‌వుతుంది. వారే గెలిచిన‌ట్టు.. కానీ ఈ టాస్క్‌లో అభిజిత్ టీమ్ ఓడిపోవాలంటే గెస్ట్‌ల‌ని రెచ్చ‌గొట్టాల‌నే సీక్రెట్ టాస్క్‌ని అవినాష్‌కిచ్చాడు బిగ్‌బాస్‌.

ఈ క్ర‌మంలోనే అవినాష్ ప్రిన్సెస్‌గా వ‌చ్చిన అరియానాని చిల్ల‌ర వేశాలు వేయ‌క‌ని ఆట‌పట్టించ‌‌డంతో అక్క‌డ గొడ‌వ జ‌రుగుతుంది. దాన్నించి త‌ప్పించ‌డం కోసం అవినాష్ చెంప ప‌గ‌లొడ‌తాడు అఖిల్‌. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అవినాష్ త‌న సీక్రెట్ టాస్క్‌ని విజ‌య‌వంతం చేశాడా? అభిజిత్ త‌న టీమ్‌ని ఎలా గెలిపించుకున్నాడు?  బ‌ద్ద శ‌త్రువులా భావించే అభిజిత్‌ని ఈ టాస్క్‌లో సోహైల్‌, మెహ‌బూబ్ ఓడించేందుకు ఏ స్థాయికి గేమ్‌ని తీసుకెళ్లారు? .. త‌న‌ని ఏమైనా అంటే పుచ్చ ప‌గిలిపోద్ద‌ని మెహ‌బూబ్ ఎవ‌రిని ఉద్దేశించి అన్నాడు? అన్న విష‌యాలు తెలుకోవాలంటే బుధ‌వారం ఎపిసోడ్ చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news