సిట్రస్ ఫలాలు.. చర్మానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా..?

-

కరోనా కారణంగా సిట్రస్ ఫలాలకి గిరాకీ బాగా పెరిగింది. సిట్రస్ ఫలాల్లో ఉండే విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి ప్రతీ ఒక్కరికీ వీటిపై అవగాహన పెరిగింది. బత్తాయి, నారింజ, నిమ్మ మొదలగు వాటిల్లో ఉండే విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఐతే విటమిన్ సి, చేసే పనుల్లో చర్మానికి మేలు చేసే పని కూడా ఉంది. చర్మ ఆరోగ్యానికి విటమిన్ సి చేసే మేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ సి ని ఆస్కార్బిక్ ఆమ్లం అని కూడా అంటారు. సిట్రస్ ఫలాల్లో ఉండే ఈ విటమిన్, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సాయపడుతుంది. దెబ్బతిన్న చర్మ కణాలని ఆరోగ్యవంతం చేయడానికి, వాతావరణ మార్పుల వల్ల చర్మంపై వచ్చే మార్పులని నిరోధించడానికి, నల్ల మచ్చలని తగ్గించడానికి సాయపడుతుంది. ఇంకా స్కిన్ టోన్ ని బయటకి తీసి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది.

కొల్లాజెన్ అనేది ఒక ప్రోటీన్. చర్మం తయారు కావడంలో కొల్లాజెన్ పాత్ర కూడా ఉంటుంది. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా మారి అందంగా ఉంటుంది. సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల వల్ల కొల్లాజెన్ దెబ్బతిని చర్మం అనారోగ్యంగా తయారవుతుంది. విటమిన్ సి వల్ల కొలాజెన్ కి హాని కలగకుండా ఉంటుంది. అంతే కాదు చర్మానికి రంగునిచ్చే మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ మెలనిన్ అధికంగా ఉత్పత్తి అయితే చర్మం నల్లగా మారుతుంది.

సో.. విటమిన్ సి వల్ల కలిగే లాభాలని తెలుసుకున్నారు కదా. ఇక నుండి మీ ఆహారంలో సిట్రస్ ఫలాలు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే సిట్రస్ ఫలాల్లో విటమిన్ సి అధిక శాతంలో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news