RRR Movie: నాటు నాటు సాంగ్ కి బిగ్ బాస్ కంటెస్టెంట్ల అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైర‌ల్

-

RRR Movie: మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. పాన్ ఇండియా చిత్రంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు మూవీ మేక‌ర్స్. ఈ చిత్రం విడుద‌ల కాక ముందు నుంచే.. ఎన్నో రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం విడుదల కోసం యవ‌త్తు సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తితో వేచిచూస్తున్నారు. ఈ సినిమా పై మ‌రింత హైప్ క్రియేట్ అయ్యేలా.. టీజర్లు, గ్లింప్స్‌లు, పాటలు విడుద‌ల చేస్తున్నారు. వీటి నెట్టింట్లో ట్రెండింగ్ గా మారాయి. స‌రికొత్త రికార్డుల‌ను రాస్తోన్నాయి.

తాజాగా విడుద‌లైన ‘నాటు నాటు’ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఇప్పటివరకు 28 మిలియ‌న్ల వ్యూస్ ను కైవ‌సం చేసుకోంది. ఈ పాటకు కీరవాణి స్వరాలు, చంద్రబోస్‌ సాహిత్యం, కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్ లు ఆల‌పించడంతో ఓ రేంజ్ లో ఉంద‌నే చెప్పాలి. ఇక ఈ పాటలో యంగ్ టైగ‌ర్, మెగా ప‌వ‌ర్ స్టార్ మాస్ స్టెప్పులు హైలెట్ గా నిలిచాయి.

ఈ క్రమంలో మెగా, నంద‌మూరి ఫ్యాన్స్ త‌మ అభిమానాన్ని చాటుకునేలా .. ఈ పాటకు స్ఫూప్‌లు, కవర్‌ సాంగ్‌లు, రీక్రియేట్‌ చేస్తూ ఆ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ పాట మీద ఓ బామ్మ కూడా స్టెప్పులేసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే . ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం కూడా ఈ వీడియోపై ప్రశంసలు కురిపించింది.

తాజాగా బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మెహబూబ్ లు జంట‌గా నాటు నాటు సాంగ్ కు తమదైన రీతిలో డాన్స్ చేశారు. అచ్చం.. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ల‌ను పోలిన‌ట్టుగా.. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంటు ధరించి, అద్భుతమైనా.. స్టెప్స్ వేశారు. ఈ వీడియోను మెహబూబ్ తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. బ్రోస్ మీ స్టెప్స్ అదుర్స్ అంటూ.. లైక్స్, షేర్స్ చేస్తూ.. ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఇక, సోహైల్, మెహబూబ్ లు బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రూ మంచి మిత్రులుగా మెలిగారు. హౌస్ లో ఒకరికి ఒకరు అన్నట్లు మెదిలారు. సోహైల్ ఫైనల్ కి వెళ్లగా.. మెహబూబ్ చివ‌రి వారం ఎలిమినేట్ అయ్యాడు. సోహైల్ కు బిగ్ బాస్ నుంచి రూ. 25 లక్షలు గిప్ట్ రాగా.. అందులో మెహబూబ్ ఇంటి కోసం పది లక్షలు ఇచ్చాడు. అయితే వీరిద్ద‌రి స్నేహాన్ని మెచ్చి.. చిరంజీవి, మెహబూబ్ కి పదిలక్షలు ఇవ్వడం జరిగింది. ఇలా వారి స్నేహం కొన‌సాగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news