బిగ్ బాస్: నిజంగా అంతా నోయల్ పుణ్యమేనా..?

-

ఈ వారం హౌస్ నుండి ఎవ్వరూ ఎలిమినేట్ అవ్వలేదు. నామినేషన్లో ఉన్న ఆరుగురు కూడా సేవ్ అయ్యారు. చివరి వరకూ ఉత్కంఠగా నడిపి చివర్లో మాత్రం అందరూ సేఫ్ అని చెప్పారు. ఐతే అమ్మ రాజశేఖర్, మెహబూబ్ ల మధ్య నడిచిన ఎలిమినేషన్ పోటీలో అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అవుతాడన్నట్టుగా ఎలివేషన్ ఇచ్చారు. కానీ చివర్లో అంతా తూచ్ మనిపించారు. దానికి గల కారణం నోయల్ అని చెప్పడం విశేషం.

 

ఆరోగ్యం బాగాలేనందున నోయల్ నిన్ననే హౌస్ నుండి బయటకి వెళ్ళాడు. అతనికి అందరూ వీడ్కోలు కూడా పలికారు. దాంతో ప్రేక్షకులు ఈ వారం నామినేషన్లో ఉన్నవాళ్ళంతా సేవ్ అని ముందే కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ ఎపిసోడ్ కి ఉత్కంఠగా సాగించాలన్న రీతిలో నామినేషన్లో ఉన్న ఒక్కొక్కళ్ళని సేవ్ చేస్తూ, చివర్లో నోయల్ చెప్పిన కారణంగా ఎవ్వరినీ ఎలిమినేట్ చేయట్లేదని చెప్పడం వింతగా తోచింది.

తాను బయటకు వెళ్తున్నాడు కాబట్టి హౌస్ లో నుండి మరొకరిని బయటకు పంపద్దు అని నోయల్ చెప్పాడని అన్నారు. నోయల్ అలా చెప్పి ఉండవచ్చు కానీ, ప్రేక్షకులు ముందే పసిగట్టారు. హౌస్ లో ఉన్న పదకొండు మందిలో నుండి ఈ వారమే ఇద్దరు వెళ్ళిపోతే సమస్య వస్తుంది. కంటెస్టెంట్స్ తగ్గుతూ వెళ్తే షోలో డ్రామా క్రియేట్ అవదు. అందుకే బిగ్ బాస్ వారు ఒకే సారి ఇద్దర్ని పంపడానికి ఆసక్తి చూపించరు. అదీగాక ఈ టైమ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఆస్కారమే లేదు. సో.. బిగ్ బాస్ వారికి మరో ఆప్షన్ లేదు.

Read more RELATED
Recommended to you

Latest news