ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న బిగ్ బాస్ మానస్.. ఫొటోస్ వైరల్..!

-

బిగ్ బాస్ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రముఖ సీరియల్ యాక్టర్ మానస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ప్రముఖ ట్రాన్స్ జెండర్ ప్రియాంక ఇతడిని ప్రేమిస్తోంది అంటూ వార్తలు బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ షో పూర్తి అయిన తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇకపోతే బిగ్ బాస్ ద్వారా మంచి పేరు సంపాదించుకున్న మానస్ బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైన విషయం తెలిసిందే. అంతే కాదు పలు సినిమాలలో కూడా నటిస్తున్నారు ఈయన. ఇటీవల యాంకర్ విష్ణు ప్రియ తో కలిసి కవర్ సాంగ్స్ చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఆయన ఒక ఇంటి వారు కాబోతున్నారు. శ్రీజ నిస్సంకర అనే అమ్మాయితో మానస్ వివాహ నిశ్చితార్థ వేడుక చాలా ఘనంగా జరిగింది. ఇక ఈ కొత్త జంటను ఆశీర్వదించడానికి.. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు హాజరయ్యారు. కాజల్, తేజస్విని గౌడ, వీ.జే.సన్నీ తదితరులు ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇకపోతే వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమే. ఇక ఈ వేడుకలో ఇరువురు కుటుంబ సభ్యులు కూడా హాజరై సందడి చేశారు.

ఇకపోతే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో మానస్ షేర్ చేసుకోగా.. అమ్మాయి ఎవరు అని అభిమానులు సైతం తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మరొకవైపు శ్రీజ కి ఇన్స్టాగ్రామ్ ఉన్నప్పటికీ కూడా ఆమె ఇందులో తన ఫోటోలను షేర్ చేయలేదు.. మానస్ మాత్రమే షేర్ చేసిన ఈ ఫోటోలు, వీడియో లు చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news