కుత్బుల్లాపూర్ కుస్తీ.. కారులో పోరు.. సెట్ అవ్వట్లేదు.!

-

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అభ్యర్ధులని ప్రకటించక ముందు వరకు సీట్ల కోసం నేతలు పోటీ పడ్డారు. పోటాపోటిగా కార్యక్రమాలు చేశారు. అభ్యర్ధులని ప్రకటించాక..సీట్లు దక్కిన నేతలు యాక్టివ్ గా తిరుగుతున్నారు. సీట్లు దక్కని వారు మాత్రం..యాక్టివ్ గా లేరు..పైగా ఎన్నికల బరిలో ఉండే అభ్యర్ధులకు సహకరించేది లేదని బీష్మించుకుని కూర్చున్నారు. అక్కడకు కొంతమందికి సర్ది చెప్పి నేతలని కలుపుతున్నారు. కానీ కొందరు కలవడం లేదు.

ఇదే క్రమంలో కుత్బుల్లాపూర్ లో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ  శంభీపూర్‌ రాజు మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. 2014లో టి‌డి‌పి నుంచి గెలిచిన వివేకా..తర్వాత బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. 2018లో సీటు దక్కించుకుని మళ్ళీ గెలిచారు.ఇప్పుడు మరొకసారి వివేకాకు సీటు వచ్చింది. దీంతో శంభీపూర్‌ రాజు అసంతృప్తితో ఉన్నారు. మొదట నుంచి పార్టీలో ఉంటూ…తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా ఉన్న తనకు కాకుండా వివేకానందకు సీటు ఇవ్వడంపై ఆగ్రహంతో ఉన్నారు.

అయితే కుత్బుల్లాపూర్ అంశంపై మంత్రి హరీష్ రావు ఫోకస్ పెట్టి.. అసంతృప్తికి చెక్ పెట్టాలని చూశారు. ఎమ్మెల్యే వివేకానందకు అందరినీ కలుపుకుని వెళ్లాలని హరీష్ సూచించడంతో ఎమ్మెల్యే.. శంభీపూర్‌ రాజుని కలిశారు. అయినా సరే ఇద్దరి మధ్య సఖ్యత లేదు. ఇటీవల ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరు కాగా, ఎమ్మెల్సీకి ఆహ్వానం అందలేదట. దీంతో ఆయన వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది.

అలాగే ఎమ్మెల్సీతో సఖ్యతగా ఉన్న కార్పొరేటర్లు సైతం కార్యక్రమానికి వెళ్లకుండా వెనుదిరిగారాని తెలిసింది. ఇలా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య పంచాయితీ నడుస్తోంది. ఈ సారి ఎన్నికల్లో వివేకానంద కోసం పనిచేసేది లేదని ఎమ్మెల్సీ వర్గం గట్టిగానే చెబుతుందట. దీంతో కుత్బుల్లాపూర్ లో బి‌ఆర్‌ఎస్‌కు ఏదైనా నష్టం వస్తుందా? అనే విశ్లేషణలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news