బిగ్ బాస్: అవినాష్ ను తన్నిన మోనాల్..!

-

బుల్లితెరపై బిగ్ బాస్4 చివరి దశకు వచ్చేసరికి అందరిలోనూ టెన్షన్ మొదలయ్యింది. మిగిలిన ఏడుగురిలో ఎవరు విజేత అవుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. సోమవారం ఇచ్చిన టాస్క్ లో కంటెస్టెంట్ ల మధ్య పెద్ద రచ్చే జరిగింది. ఇక మోనాల్ పట్టుకున్న పాలను దొంగిలించాడు అవినాష్. దాంతో ఆ ఇద్దరిమధ్య కొట్లాట జరిగింది. ఆతర్వాత పాలు పట్టుకునే క్రమంలో మోనాల్ అవినాష్ ను తన్నింది.

bigg-boss-4
bigg-boss-4

దాంతో మోనాల్ షూ లాగేసి విసిరేసాడు అవినాష్. దానికి అవును నేను తన్నా.. నువ్ నన్ను తోస్తున్నావ్ అని అరుస్తూ ఎదురు తిరిగింది మోనాల్. దాంతో అవినాష్ మోనాల్ దగ్గరకు వచ్చి నేను కూడా తన్నుతా అన్నాడు. ఇంతలో అఖిల్ కలుగజేసుకొని బ్రదర్ చూసి ఆడు అని చెప్పడంతో.. ఎవరూ మాట్లాడకండి.. ఆమె తన్నినప్పుడు ఎవరూ మాట్లాడలేదు.. అమ్మాయి అంటే చాలు సపోర్ట్ చేసేస్తారు. నా గేమ్ నన్ను ఆడనివ్వండి. టీంలు టీంలుగా ఆడుతున్నారు.

నేను ఈ టాస్క్ ఆడను అని అరుస్తూ కెమెరా ముందుకు వచ్చి బిగ్ బాస్ కు చెప్పుకున్నాడు అవినాష్. అయితే చివరికి అరియానా కూడా అవినాష్ నువ్ చాలా రాష్‌గా బిహేవ్ చేస్తున్నావ్.. అని అనడంతో నీ ఆట నువ్ ఆడు అంటూ ఆమె మీద కూడా ఫైర్ అయ్యాడు అవినాష్. ఇక గేమ్ ఆడను ఇంటికి వెళిపోతా.. ఎలిమినేట్ చేసి దొబ్బండి.. నాకు అవసరం లేదు అంటూ కాసేపు ఎగిరాడు అవినాష్.

ఇక ఇలాగైతే నేను గేమ్ ఆడలేను అని కిచెన్‌లోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నాడు అవినాష్. ఆతర్వాత అతి తెలివి ప్రదర్శిస్తూ..ఆవు నుంచి వచ్చిన పాలతో కాకుండా ఫ్రిడ్జ్‌లో ఉంచిన పాలను తన కేన్‌లో వేసి.. వాటర్ కలిపాడు అవినాష్. దాంతో అవినాష్ దగ్గర ఉన్న బాటిల్స్ లెక్కలోకి రావని బిగ్ బాస్ చెప్పడంతో గేమ్ నుంచి అవుట్ అయ్యాడు. ఇక ఈ వారం నామినేషన్ లో కూడా అవినాష్ ఉండటంతో అతడు బిగ్ బాస్ వదిలి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news