బిగ్‌ బాస్ 4‌ టీజర్‌ వచ్చేసింది.. అదిరిపోయే లుక్కుతో

-

బిగ్‌ బాస్‌ అభిమానులకు శుభవార్త.. బిగ్ బాస్‌ తెలుగు సీజన్‌ 4 టీజర్‌ వచ్చేసింది. తొలి మూడు సీజన్ లతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఉర్రూతలూగించిన బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్’ నాలుగవ సీజన్ కు ముస్తాబవుతోంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 4 ఉంటుందని ప్రోమో విడుదల చేసింది. అయితే కంటెస్టెంట్స్ ఎవరు.. ఎలా ఉంటుంది.. ఈ సారి షో ఎన్ని రోజులు ఉంటుందనే విషయంపై మాత్రం కన్ఫర్మేషన్ రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియా లో జరుగుతున్న చర్చ ప్రకారం.. కేవలం 70 రోజులే ఈ షో ఉండబోతునట్టు తెలుస్తుంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ రియాల్టీ షో పై ప్రేక్షకులు చాలా అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే కంటెస్టంట్ల లిస్ట్‌ ఫైనల్‌ అయినట్లు సమాచారం. . గత సీజన్‌లో ప్రేక్షకులను మెంప్పించిన నాగ్‌ ఈ సీజన్‌ కూడా కంటిన్యూ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

అనేక భాషల్లో హిట్‌ అయిన బిగ్‌బాస్‌ షోను 2017లో తెలుగు బుల్లితెరకు కూడా పరిచయం చేశారు. ప్రతి సారీ జూన్‌ లేదా జూలైలో బిగ్‌బాస్‌ షో ప్రారంభం అవుతుంది. మొదటి సీజన్‌ జూలై 16, 2017న ప్రారంభం అయితే.. రెండోదాన్ని 2018 జూన్‌ 10కే ప్రారంభించారు. ఇక మూడో సీజన్‌ 2019, జూలై 21 వరకు ప్రారంభం అయింది. అయితే ఈ సంవత్సరం కరోనా కారణంగానే బిగ్‌బాస్‌ సీజన్‌ ఆలస్యం అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version