నిజం ఒప్పుకున్న నాగార్జున…. ఆయన లేకపోతే మెంటలెక్కిపోతుందన్న దివి!

-

కరోనా, లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన ప్రజలకు బిగ్ బాస్ షో కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. ముందుగా అనుకున్న విధంగానే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగ్ చెప్పేశాడు. తొలివారం నామినేట్ కాకపోవడం వల్ల సేఫ్ అయిన కరాటే కల్యాణి ఈ వారం ఎలిమినేట్ అయింది. ఆమె నోటి దురుసే ఎలిమినేషన్ కు కారణమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈరోజు నాగ్ ఎవరిని ఎలిమినేట్ చేస్తారో చూడాల్సి ఉంది.

మరోవైపు గత కొన్ని రోజులుగా 61 ఏళ్ల నాగార్జున 60 ఏళ్ల గంగవ్వను అవ్వా అని పిలవడం ఏమిటని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో నాగార్జున గంగవ్వని చెల్లి అని పిలిచి గంగవ్వ కంటే వయస్సులో తనే పెద్ద అనే విషయాన్ని అంగీకరించాడు. నిన్నటి ఎపిసోడ్ లో గంగవ్వ ఇంట్లో నుంచి వెళ్లిపోనని… అవినాష్ ది బర్రె ముక్కు అని కామెంట్లు చేసింది.

నాగ్ ఇంటి సభ్యులు గేమ్ ను సీరియస్ గా తీసుకోవడం లేదని…. నామినేషన్ ప్రక్రియను సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. ప్రేక్షకులు గేమ్ ఆడేవాళ్లకు మాత్రమే ఓట్లు వేస్తారని త్యాగాలు చేసే వాళ్లకు ఓట్లు పడవని తెలిపారు. అనంతరం గంగవ్వ సేఫ్ అయినటు ప్రకటించి హీరో – జీరో గేమ్ ఆడించారు. హీరో అయిన వాళ్లను కుర్చీ మీద కూర్చోబెట్టాలని… జీరో అనుకున్న వాళ్లను బయటకు గెంటేయాలని సూచించారు.

నోయల్, సుజాత అమ్మ రాజశేఖర్ ను హీరో ప్లేస్ లో కూర్చోబెట్టగా దేవి కామెడీ చేస్తే ఇక్కడ హీరోలా…? అని ప్రశ్నించింది. హౌస్ లో శృతి మించిన కామెడీ నచ్చలేదని…. గర్భవతిగా దివి నటించే సమయంలో ఆమెకు మాస్టర్ పిల్లో పెట్టడం తనకు నచ్చలేదంటూ లాస్య కామెంట్లు చేసింది. దీంతో మాస్టర్ హౌస్ నుంచి వెళ్లిపోతానని చెప్పాడు. దివి హౌస్ లో మాస్టర్ లేకపోతే మెంటలెక్కిపోతుందని తన విషయం గురించి అందరి ముందు మాట్లాడాల్సిన అవసరం ఏంటమని లాస్యను ప్రశ్నించగా లాస్య నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version