ఎట్టకేలకు బిగ్ బాస్ ఆరో సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోని ఎవరు విన్నర్ అవుతారు అనే ఉత్కంఠ కూడా నెలకొంది. ఇకపోతే బిగ్ బాస్ ఆరవ సీజన్లో విన్నర్ గా ఎన్నికైన వారికి రూ. 50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారని ఎప్పుడో ప్రకటించారు. కానీ కంటెస్టెంట్స్ కి రకరకాల టాస్కులు ఇచ్చి అందులో ఓడిపోతే బిగ్ బాస్ ప్రైజ్ మనీలో అమౌంట్ తగ్గుతుందని చెప్పి గత రెండు వారాలుగా బిగ్ బాస్ ప్రైస్ మనీ లో కత్తిరింపులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వారంలో చివరి రెండు రోజులు మరిన్ని టాస్కులు ఇచ్చి ఈ టాస్కులు చేస్తే బిగ్ బాస్ ప్రైజ్ మనీ పెరుగుతుందని చెప్పి రకరకాల టాస్కులను ఇచ్చాడు బిగ్ బాస్.
ఇకపోతే కంటెస్టెంట్స్ అంత బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఎక్కువగా ఉండాలని కష్టపడి మరీ టాస్కులు చేశారు. చివరిగా నష్టపోయిన మనీ ని మళ్లీ గెలిచి..మనీ అంతా లెక్కలు వేసి విన్నర్ కి బిగ్ బాస్ ప్రైజ్ మనీ రూ. 47 లక్షలకు చేరింది అని తాజా ఎపిసోడ్లో ప్రకటించారు. అయితే మొత్తంగా చూసుకుంటే మూడు లక్షల రూపాయలు లాస్ వచ్చినట్టే. అయితే బిగ్బాస్ ఈ ప్రైజ్ మనీతో పాటు రూ.25 లక్షల విలువ చేసే ఒక ల్యాండ్ కూడా ఇస్తామని హోస్ట్ నాగార్జున ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ లో ఈ రూ.47 లక్షల బిగ్ బాస్ ప్రైజ్ మనీతో పాటు రూ.25 లక్షల విలువైన ల్యాండ్ ను ఎవరు గెలుచుకుంటారు అనేది ఇప్పుడు ఉత్కంఠమరితంగా మారింది.
ఇకపోతే బిగ్ బాస్ హౌస్లో 14వ వారం నడుస్తోంది. 21 మంది సభ్యులతో మొదలైన బిగ్ బాస్ లో ఇప్పటికే 13 మంది ఎలిమినేట్ అవ్వగా ప్రస్తుతం ఏడుగురు మాత్రమే మిగిలి ఉన్నారు. శ్రీహన్, రేవంత్, రోహిత్, శ్రీ సత్య , కీర్తి, ఆదిరెడ్డి , ఇనయాలు ప్రస్తుతం హౌస్ లో ఉన్నారు మరి వీరిలో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారో చూడాలి.