Bigg Boss 5 Telugu: ఇక నాగిని డాన్స్ కు ఉద్వాస‌న‌..!

-

Bigg Boss 5 Telugu: బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను టీవీల ముందు క‌ట్టిప‌డేస్తోన్నషో బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5. ఈ షో చివ‌రి ద‌శ‌కు చేరడంతో టైటిల్ రేస్ ఉత్కంఠగా మారింది. 19 మందితో ప్రారంభ‌మైనా షోలో ఇప్ప‌టి వ‌ర‌కూ 9 మంది ఎలిమినేట్ కాగా.. ఒక‌రూ అనారోగ్య కార‌ణాల‌తో బిగ్ బాస్ హౌ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం తొమ్మిది మంది మాత్రమే మిగిలారు. ఈ త‌రుణంలో ఇంటి నుంచి ఎవ‌రూ ఎలిమినేట్ కాబోతున్న‌ర‌న్న‌ది ఆస‌క్తిగా మారింది.

తొలి వారంలో సరయు వెళ్లిపోగా.. ఆ త‌రువాత‌ ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేత, ప్రియ, లోబో, విశ్వ లు వ‌రుస‌గా ఎలిమినేట్ కాగా.. అనారోగ్యంతో జెస్సీ బిగ్ బాస్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ వారం నామినేష‌న్లో హౌస్ కెప్టెన్‌గా ఉన్న రవి మినహా.. షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, ఆనీ మాస్టర్, సన్నీ, కాజల్, మానస్‌, ప్రియాంక లు నామినేష‌న్ లో నిలిచారు. నిన్న‌టి షోలో స‌న్నీ, శ్రీ‌రామ్ చంద్ర‌లను కింగ్ నాగ్ సేఫ్ చేశారు.

ఈ క్ర‌మంలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నార‌నే ప్ర‌శ్న‌కు అన్ అఫీసియ‌ల్ పోల్స్ లో గానీ, నెట్టింట్లో గానీ.. ఒకే స‌మాధానం వ‌స్తుంది. ఈ వారం ఎలిమినేట్ కానున్న‌ది ఆనీ మాస్ట‌రే అని తేగేసి చెప్తున్నారు. ఆనీ మాస్టర్‌తో నాగిని డాన్స్ చేయించి మరీ బయటకు పంపిస్తున్నారట‌.

ఆనీ మాస్ట‌ర్ ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సింది. కానీ బిగ్ బాస్ ఆమె పై చూపించిన అతి ప్రేమతో ఆమె 11వ వారం వరకూ హౌస్ లో కొన‌సాగింది. ఆనీ మాస్ట‌ర్ ప్ర‌వ‌ర్త‌న చాలా వింత‌గా ఉండేది. ఆమె అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్ర‌ధానంగా కాజ‌ల్ ను టార్గెట్ చేసి వెక్కిరించ‌డం. హేళ‌న చేయ‌డం ఇవన్నీ ఛీ కొట్టేలా చేశాయి. ఫైన‌ల్ గా ఆనీ మాస్ట‌ర్ ను చూస్తేనే అసహ్యపడేలా చేశాయి. ఈ వారం నామినేష‌న్లో ఆనీ మాస్ట‌ర్ ప్ర‌వర్త‌న రోత పుట్టించేలా ఉంది. కాజల్‌ని నాగిని నాగిని అంటూ హేళ‌న చేస్తూ నాగార్జున ముందే డాన్స్ చేసింది. నామినేషన్స్‌లో ఉన్న కూడా ఆమె తీరులో ఎలాంటి మార్పు రాలేదు.

హోస్ట్ నాగార్జున కూడా ఆనీ మాస్టర్‌కి ఫుల్ సపోర్ట్ గా ఉన్న‌ట్టు అనిపించింది. అస‌లు ఆనీ మాస్ట‌ర్ మూడో వారం అయ్యేదే కానీ, ఆనీ మాస్టర్‌‌కి స్పెషల్ పవర్‌లు ఇచ్చి.. నామినేషన్స్ నుంచి తప్పించారు. ఆ తరువాతి వారం కెప్టెన్ కావ‌డంతో ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకుంది. ఇలా ఆమెకు అదృష్టం శ‌నిలా ప‌ట్టుకుంది. అందుకే 11 వ వారం వ‌ర‌కూ హౌస్ లో ఉండ గ‌లిగింది. నెట్టింట్లో కూడా ఆమె ఆట తీరుపై వ్య‌తిరేక‌త వ‌చ్చింది. పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ వారం ఆమెను గ‌ట్టెక్కించ‌డం .. బిగ్ బాస్ షో నిర్వాహకులకు కూడా సాధ్యం కాదు. ఏమైనా చేసి.. ఆమెను హౌస్లో ఉంచితే.. మాత్రం బిగ్ బాస్ షో మొత్తం ‘అప్పడం’ అయినట్టే. దీంతో ఈ వారం ఆనీ మాస్ట‌ర్ కు ఉద్వాస‌న ప‌ల‌కాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news