బ్రిటన్ లో కరోనా విలయతాండవం… రోజురోజూ పెరుగుతున్న కేసులు

కరోనా తీవ్రతకు యూరప్ అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా తూర్పు యూరప్ దేశాల్లో పెద్ద ఎత్తున కేసులు పెరుగుతున్నాయి. కరోనా ధాటికి ఆస్ట్రియా వంటి దేశాలు మళ్లీ లాక్ డౌన్ విధించాయి. జర్మనీ, రష్యా, బ్రిటన్ దేశాల్లో రికార్డ్ స్థాయి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బ్రిటన్ లో శనివారం ఒక్కరోజే 40,941 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. శనివారం 150 మంది కరోనాతో చనిపోయారు.

బ్రిటన్ లో ఇప్పటి వరకు మొత్తం 9,80,6034 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాలు బ్రిటన్‌లో ఇప్పుడు 143,866గా ఉన్నాయి. 8,079 కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బ్రిటన్‌లో 12 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో 88 శాతం కంటే ఎక్కువ మంది తమ మొదటి డోస్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. 80 శాతానికి పైగా జనాభా రెండు డోసుల వ్యాక్సిన్ ను తీసుకున్నారు. 25 శాతం కంటే ఎక్కువ మంది బూస్టర్ డోసులు తీసుకున్నారు. అయినా కూడా కరోనా తీవ్రత పెరుగుతుండటం ఆ దేశాన్ని కలవరపరుస్తోంది.