ముందు మీ పిల్లల్ని బోర్డర్ కు పంపండి, అప్పుడు తెలుస్తుంది… సిద్దూ వ్యాఖ్యలపై గౌతం గంభీర్..

-

ముందు మీ పిల్లల్ని బోర్డర్ కు పంపండి అప్పుడు తెలుస్తుంది పాకిస్థాన్ నిజ స్వరూపం అంటూ బీజేపీ ఎంపీ గౌతం గంభీర్, పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ నవజ్యోత్ సింగ్ సిద్దూ పై ఫైర్ అయ్యారు. ’మీ పిల్లల్ని బోర్డర్ కు పంపించి.. ఆ తర్వాత తీవ్రవాద దేశ ప్రధానిని పెద్దన్నగా పిలవండి‘ అంటూ సిద్దూ కు గంభీర్ చురకలు అంటించారు. సిద్దూ పిల్లలు సైన్యంలో ఉంటే..అతను ఇప్పుడు కూడా ఇమ్రాన్ ఖాన్ ను పెద్దన్న అని పిలిచేవాడా..? అని ప్రశ్నించాడు. గత నెలలో కాశ్మీర్ లో 40 మంది ప్రజలు, సైనికులు ఉగ్రవాద దాడుల్లో మరణించారని.. అలాంటిది వారిపై సిద్దూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. సిద్దూ ప్రవర్తన భారతదేశానికి వ్యతిరేఖంగా సాగుతుందని విమర్శించారు గంభీర్.

సిద్దూ పాక్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వాను కౌగిలించుకుంటాడు.. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పెద్దన్నగా పిలుస్తాడని.. ఇంతక కన్నా అవమానకర వ్యాఖ్యలు ఏమీ ఉండవని.. సిద్దూ మీరు ఈ వ్యాఖ్యలకు సిగ్గుపడండి అంటూ ఘాటుగా విమర్శించారు గంభీర్. “ఏసీ గదుల్లో కూర్చోని,  కర్తార్‌పూర్ సాహిబ్ కి వెళ్లి మాట్లాడటం చాలా సులభమని.. సరిహద్దుల్లో కొడుకులను కోల్పోయిన కుటుంబాలను అడగాలి. ఆ బాధ్యత ఎవరిది? అని సిద్దూను గౌతం గంభీర్ ప్రశ్నించారు. రాజకీయం కన్నా ముందు దేశభక్తి ముఖ్యమని గౌతం గంభీర్ అన్నారు. సిద్దూ ఎలాంటి రాజకీయం చేస్తున్నాడో దేశ ప్రజలకు అర్థం అయిందని గౌతం గంభీర్ విమర్శించాడు.

Read more RELATED
Recommended to you

Latest news