Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ లో బిగ్ ట్విస్ట్.. ఏకంగా 12 మంది..!

-

బిగ్ బాస్ 8వ సీజన్ కి సంబంధించి 24వ ఎపిసోడ్ ఇవాళ ప్రసారం అవుతోంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో విడుదలైంది. 24వ ఎపిసోడ్ రెండో ప్రోమో అంటూ విడుదలైన ఈ ప్రోమో చూస్తే.. బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. ఈ సీజన్ లో ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగు పెట్టబోతున్నారని, మీ బలబలాలు చూపించి వైల్డ్ కార్డు ఎంట్రీ ఆపే శక్తి కూడా మీలోనే ఉంది అంటూ కంటెస్టెంట్స్ లో  బిగ్ బాస్ ఆసక్తి కలిగించారు.

కాంతారా క్లాన్ కి సీత చీఫ్ గా ఎన్నికవ్వగా.. శక్తి క్లాన్ కి ఎప్పటి మాదిరిగానే నిఖిల్ చీఫ్ గా కొనసాగుతున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో భూకంపం రాబోతుంది అంటూ చెప్పి అందరినీ ఆశ్యర్యపరిచారు. బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా 12 వైల్డ్ కార్డు ఎంట్రీస్ మరో రెండు వారాల్లోనే రాబోతున్నాయని అర్థం అవుతోంది. ప్రతీ ఛాలెంజ్ గెలిచిన ప్రతీ సారి మీరు ఒక వైల్డ్ కార్డు ఎంట్రీని ఆపవచ్చు అంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు బిగ్ బాస్. 12 ఛాలెంజ్ లను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గెలిస్తే.. వారిని ఆపవచ్చు. కానీ అది కుదిరేలా కనిపించడం లేదు. సగం మందిని ఆపినా 5 లేదా 6గురు వ్యక్తులు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరీ చూడాలీ టాస్క్ లలో ఎవరు గెలుస్తారనేది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version