కన్నీటిని తెప్పిస్తున్న బిగ్ బాస్ ఇనయ కష్టాలు.. వీడియో వైరల్..!!

సాధారణంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి నాచురల్ స్టార్ నాని నుంచి ఇటీవల బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ వరకు ఇలా ఎంతోమంది తినడానికి తిండి లేకుండా ఎక్కడో చిన్నచిన్న గల్లీలలో ఉంటూ తమ ప్రయాణం మొదలుపెట్టి.. నేడు మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అయితే సాధారణంగా అబ్బాయిల విషయంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ బిగ్ బాస్ ద్వారా భారీ పాపులారిటీని సొంతం చేసుకుంటున్న ఇనయ సుల్తానా రియల్ లైఫ్ గురించి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మన కంటి వెంట కన్నీరు వస్తుంది . అంతలా తన బాధలను దిగమింగుకొని ప్రస్తుతం బిగ్ బాస్ లో 13వ వారానికి చేరుకుంది ఈ ముద్దుగుమ్మ.

Inaya Sultana on Twitter: "Please support INAYA SULTHANA Login to Disney + Hotstar APP Search for BIGG BOSS CAST YOUR VOTE FOR INAYA SULTHANA (10 Votes) Give 10 missed calls to 72888

బిగ్ బాస్ లోకి రావడానికి ముందు ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఇనయ మాట్లాడుతూ.. ” ఇండస్ట్రీలోకి రావాలని ఎన్నో కలలు కన్నాను. ఇంట్లో అడిగితే ఒప్పుకోలేదు. దాంతో వంద రూపాయలు చేతిలో పట్టుకొని ఇంటి నుంచి బయటకు వచ్చి నగరి నుంచి తిరుపతి చేరుకున్నాను. అక్కడ ఒక ఫ్రెండ్ దగ్గర ఒకే బెడ్డు, ఒకే పిల్లో షేర్ చేసుకుని చిన్న చిన్న జాబులు చేసుకుంటూ కొంతవరకు ప్యాకెట్ మనీ కోసం డబ్బు సంపాదించుకున్నాను. అయితే ఇండస్ట్రీలోకి వస్తానని చెప్పినప్పుడు ఆఖరికి నా కుటుంబ సభ్యులే కాదు స్నేహితుల కూడా నన్ను ప్రోత్సహించలేదు. మొదటగా నవ్వారు.. కానీ నేను తిరుపతి నుండి హైదరాబాద్ కి వచ్చి.. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎవరు కూడా నాకు తెలియదు. అయినా పట్టుదలతో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చాను. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆరు నెలలుకు అవకాశాలు రావడం మొదలయ్యాయి. చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ వచ్చాను.

ప్రస్తుతం బుజ్జి ఇలా రా, ఏవం జగత్ వంటి సినిమాలలో కీలకపాత్ర పోషించాను. ప్రస్తుతం మరో మూడు చిత్రాలలో లీడ్ రోల్స్ చేస్తున్నాను. మరో రెండు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పోషిస్తున్నాను అంటూ తెలిపింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతుంటే అందరూ సంతోషంగా ఉంది అని అనుకుంటున్నారు. మా అమ్మ నాతో మాట్లాడటం లేదని ప్రతిరోజు నేను బాధపడుతున్నాను. మా కుటుంబ సభ్యులు ఫోన్ చేసి నీవల్లే మా పరువు పోతుంది అంటుంటే నా మనసు మరింత ముక్కలవుతోంది. ఒక ఆడపిల్లకు డ్రీమ్ ఉండదా? ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న వాళ్లంతా పరువు పోయిందని ఆలోచిస్తున్నారా? అంటూ తన కష్టాలను చెప్పుకుంది ఇనయ.. అంతే కాదు తన బాధలను చెప్పుకొని లైవ్ లోనే కంటతడి పెట్టడంతో అది చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆమెపై మరింత సానుభూతి తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.