Bigg Boss 5 Telugu: త‌న‌తో రూడ్‌గా బిహేవ్ చేశా.. బిగ్ బాస్ ప్రియ సెన్సెష‌న‌ల్ కామెంట్స్

-

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు 5 షో చివరి దశకు వస్తున్న కొద్దీ రసవత్తరంగా సాగుతోంది. రోజురోజుకు రచ్చ మ‌రింత పెరుగుతోంది. కంటెస్టెంట్ల మ‌ధ్య టైటిల్ పోరు హోరా హోరీగా సాగుతుంది. ఈ క్ర‌మంలో కంటెస్టెంట్ల మ‌ధ్య గొడ‌వ‌లు, అల్లర్లు చెల‌రేగుతున్నాయి. ఇక‌. వారి కోసం బయట అభిమానులు మాటల దాడికి దిగుతున్నారు. దీంతో షో మీద చాలా హైప్ క్రియేట్ అయ్యింది. అలాగే సినీ, ఇత‌ర ప్ర‌ముఖులు త‌న‌కు న‌చ్చిన కంటెస్టెంట్ల‌కు స‌పోర్టు చేయడంతో షో కు పాపుల‌రీ పెరిగింది. అలాగే.. నెట్టింట్లో టాప్ కంటెస్టెంట్ల మ‌ధ్య ఓ రేంజ్ లో ట్రోలింగ్ వార్ జ‌రుగుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా మిస్ట‌ర్ ఫ‌ర్ఫెక్ కంటెస్టెంట్ వీజే స‌న్నీకి బిగ్ బాస్ కంటెస్టెంట్, ఫైర్ బ్రాండ్ ప్రియ స‌పోర్టుగా నిలిచింది. ప్రియ హౌస్లో ఉన్నప్పుడూ స‌న్నీని ఏ రేంజ్లో హేళన చేస్తుందో.. అంద‌రికీ తెలుసు. ఆమె హౌస్ నుంచి ఎలిమినేషన్ అయ్యే వారం ముందు.. సన్నీని ఓ ఆట ఆడుకుంది ప్రియ‌. దమ్ముంటే రా.. కొట్టు రారా.. అంటూ స‌న్నీకి చుక్క‌లు చూపించింది. రెచ్చగొట్టేలా.. నీ లాంటి వాళ్ల‌ను చాలా మందిని చూసా.. అంటూ గడ్డిపరకను చూపించి అవ‌మాన‌ప‌రించింది. చెంప పగిలిపోద్ది అంటూ సన్నీపై ఆగ్రహం ప్ర‌ద‌ర్శించింది ప్రియ‌. మొత్తం మీద స‌న్నీకి 90 ఎం ఎంలో సినిమా చూపించింది. స‌డెన్ గా త‌న అభిప్రాయాన్ని మార్చుకుంది. స‌న్నీ గురించి పాజిటివ్‌గా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

తాజాగా ఓ ఇంట‌ర్య్వూలో పాల్గొన్న ప్రియ హౌస్‌లో జరిగిన విషయాలపై క్లారిటీ ఇచ్చింది. స‌న్నీ గుడ్ ప్లేయర్ అంటూ పొగడ్తలతో ముంచేత్తింది. సన్నీ పట్ల తాను రూడ్‌గా బిహేవ్ చేశానంటూ ఫీల్ అయ్యింది. చెంప పగలకొడతా అనడం బాధగా అనిపిస్తుందని, ఆ విష‌యాన్ని త‌లుచుకుని చాలా సార్లు ఏడ్చన‌ని, ఆ త‌రువాత ఇద్ద‌రం సారీ చెప్పుకున్నామ‌ని తెలిపింది.

ఆ సంఘ‌ట‌న త‌రువాత జ‌రిగిన కెప్టెటెన్సీ టాస్క్లో సన్నీకి సపోర్ట్ చేశాను. అప్పుడే మా మ‌ధ్య బాండింగ్ మొదలైంది. కానీ స‌న్నీ కెప్టెన్ గా ఉన్నప్పుడే హౌస్‌ను వీడాల్సి వచ్చిందని.. ఐ మిస్ యు సన్నీ’ అంటూ జరిగిన గొడవపై క్లారిటీ ఇచ్చింది ప్రియ.

Read more RELATED
Recommended to you

Latest news