బిగ్ బాస్ విన్నర్ అతడేనా..?

-

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ 6.. 11 వారాలు పూర్తి చేసుకున్నది. దీంతో ఈసారి టైటిల్ విన్నర్ ఎవరనే విషయంపై అటు ప్రేక్షకులు చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 12 మంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యి ప్రస్తుతం 9 మంది కంటెస్టెంట్ మాత్రమే ఉన్నారు. ముఖ్యంగా ప్రేక్షకులను మెప్పించడానికి బిగ్ బాస్ ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. కానీ మొదటి నుంచి ఈ సీజన్ చాలా నిరుత్సాహపరుస్తుంది ప్రేక్షకులను. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఎలాగోలాగా ఈ సీజన్ ని ముగించేయాలని చాలా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈసారి ఆడియన్స్ కచ్చితంగా ఈ సీజన్ విన్నర్ ఎవరనేది ఇప్పటికే డిసైడ్ చేయడం జరిగింది . సింగర్ రేవంత్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవ్వాలని బిగ్ బాస్ కూడా ఫిక్స్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అందుకే అతనికి సపోర్ట్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆటలోనే కాకుండా హౌస్ లో కూడా రేవంత్ చేస్తున్న కొన్ని పనుల వలన హౌస్ మేట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇక కెప్టెన్ గా ఉన్న సమయంలో ఫుడ్ విషయంలో రేవంత్ పెట్టిన కండిషన్స్ అక్కడ ఎవరికి నచ్చలేదు . కానీ రేవంత్ ప్రతి టాస్కులకు కూడా బెస్ట్ గా అనిపించుకుంటూ ఉన్నారు.

కానీ రేవంత్ ఆట తీరును ప్రతి ఒక్కరిని మెప్పించింది. టాస్క్ ఎలాగోలాగా గెలవడం కాదు హౌస్ మేట్స్ మనసులను గెలుచుకోవాలి ఈ విషయంలో మాత్రం రేవంత్ కాస్త వెనుక పడ్డారని చెప్పవచ్చు. దీంతో రేవంత్ టైటిల్ విన్నర్ కాకుండా ఎవరంటే చెప్పడం చాలా కష్టము.. ఇక శ్రీహాన్ రేవంత్ తర్వాత ఉన్నారు కాబట్టి విజేత అయ్యే అవకాశాలు ఉన్న శ్రీహాన్ చేసే అతివల్ల అది దూరమయ్యేలా కనిపిస్తోంది. ఇక ఆదిరెడ్డి కూడా చివరి వారంలో ఏదైనా మ్యాజిక్ చేస్తే తప్ప టైటిల్ విన్నర్ గెలిచే అవకాశం ఉండదు. ఫైమా కూడా ఈ రేసులో ఉన్న ది.. కానీ వీరందరి కంటే రేవంత్ బిగ్బాస్ టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి చివరికి ఎవరు అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news