Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో షన్నూ, సిరిల ప్రవర్తన కొంచెం తేడాగానే ఉంది. అవకాశం దొరికితే చాలు ముద్దులు, హగ్గులు రెచ్చిపోతున్నారు. ఎఫెక్షన్స్, కనెక్షన్స్ తగ్గించుకుంటే.. మంచిదనీ, గేమ్ మీద ఫోకస్ పెడితే మంచిదని హోస్ట్ నాగ్ కూడా హెచ్చరించారు. అయినా వీరి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. నిన్నటి ఎపిసోడ్ లో ఒకే బెడ్ పై కలిసి పడుకునే అంత వరకు వెళ్ళింది. హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుండి షణ్ముఖ్,సిరి లు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. పేరుకు ఫ్రెండ్స్ అంటున్నా.. వారి ప్రవర్తన మాత్రం జిగుప్సాకరంగా ఉంది. బయట ఇద్దరికి లవర్స్ ఉన్నా.. వీరిద్దరి వాలకం చాలా తేడా కనిపిస్తోంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు.
ఏ కారణం లేకుండా.. గొడవలు, అలకలు, ఏడవటం వంటి చేష్టాలు చేస్తున్నారు. షణ్ముఖ్ సిరిపై కోపడటం .. దూరంగా వెళ్ళిపో అంటూ విసుకోవడటం.. కాసేపటి తర్వాత నాదే తప్పు అంటూ ఇద్దరూ ఒక్కరి ఒక్కరూ సారీలు చెప్పుకోవడం చూస్తునే ఉన్నాం. ఇక ఒదార్చే ప్రయత్నంలో హగ్గులు, ముద్దులు
లతో రెచ్చిపోవడం కామనే. బయట మాకు లవర్స్ ఉన్నారని చెప్పుకునే షణ్ముఖ్, సిరి లు హద్దులు దాటుతున్నారు. ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్టు చెప్పుకోస్తున్నారు.
ఇక నిన్న ఎపిసోడ్ లో వీళ్ళ ప్రవర్తన మరింత దారుణంగా ఉంది. తామిద్దరిని ఈ ప్రపంచం చూస్తుందనే ఇంగితం మరిచిపోయి.. శృతి మించి.. రెచ్చిపోయారు. అప్పటి వరకూ నామినేషన్ల పర్వం గురించి మాట్లాడుకున్నా వీరిద్దరూ.. తరువాత ఎవరి బెడ్ మీదికి వారు వెళ్లిపోయారు. ఇంతలో సిరికి ఏమైందో తెలియదు. పూనకం వస్తుందో ? ఏమో ? కానీ, ఒకే బెడ్‌పై పడుకోవద్దని షణ్ముఖ్ అన్నప్పటి నుంచి సిరి వింత వింతగా ప్రవర్తిస్తూ వస్తుంది. ఆ తరువాత ఇద్దరూ ఎప్పటిలాగే మసకమసక చీకట్లో అన్నట్టుగా కౌగిలించుకుని రొమాన్స్‌లో మునిగిపోయారు. బిగ్ బాస్ కావాలనే సిరి, షణ్ముఖ్‌లతో ఇలా చేయిస్తున్నాడా? ఈ విధంగానైనా.. రేటింగ్ రావడం లేదనీ, ఇలాంటి రొమాంటిక్ కంటెంట్.. జత చేస్తున్నాడా? ఇంత దారుణాలకు తెగపడుతున్నాడా? అనేది అర్థం కావడం లేదు. ఏదేమైనా బిగ్ బాస్ హౌస్‌ని గబ్బు హౌస్‌గా మార్చేశారు.