Bigg Boss 5 Telugu: సన్నీని టార్గెట్ చేసిన రవి ! కావాల‌నే రూల్స్ మార్చాడా?

-

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ షో.. ట్వీస్టుల‌కు పెట్టింది పేరు. ఈ క్ర‌మంలో గొడవలు, ఏడుపులు, అల్ల‌ర్లు ముమూలే.. ఎవ‌రిని ఎప్పుడూ టార్గెట్ చేస్తారో తెలియ‌డం చాలా క‌ష్టం. అంద‌రి టార్గెట్ ఒక్క‌టే… ఎలాగైనా టైటిల్ ను కైవ‌సం చేసుకోవాలి. తాజాగా జ‌రిగిన ఎపిసోడ్లో అదే జ‌రిగింది. కెప్టెన్సీ టాస్క్ లో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పవర్ రూమ్ యాక్సెస్ మానస్ కు ద‌క్కింది. అందులో ల‌భించినా.. ఆ పవర్ టూల్ ని త‌న బెస్ట్ ఫ్రెండ్ సన్నీకి ఇచ్చాడు. ఈ ప‌వ‌ర్ తో సన్నీ.. సిరి దగ్గర ఉన్న బంగారంలో సగభాగాన్ని షణ్ముక్ కి ఇచ్చేశాడు. దీంతో స‌న్నీ మీద కొంత అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసింది సిరి.

అనంత‌రం కెప్టెన్సీ టాస్కులో భాగంగా.. స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్కులో సిరి, స‌న్నీలు పాల్గొనాల్సి వచ్చింది. కానీ సిరి ఈ టాస్క్ లో పార్టిసిపేట్ చేయ‌కుండా.. త‌న స్ట్రాట‌జీని అమ‌లు ప‌రిచింది. త‌న‌కు స్మిమ్మింగ్ ఇబ్బందిగా ఉంద‌ని సంచాల‌క్ రవికి, బిగ్ బాస్ కు చెప్పింది. దీంతో బిగ్ బాస్ ..సిరి బదులుగా ఎవరినైనా ఆడోచ్చ‌ని చెప్పాడు.

సన్నీ గేమ్ ను ఎలాగైనా డిస్ట్రాబ్ చేయాల‌ని, అత‌నిపై నెటిగివ్ ఇమేజ్ క్రియేట్ చేయాల‌ని సిరి, ష‌న్నులు వేచి ఉన్నా విష‌యం తెలిసిందే . ఈ క్ర‌మంలో సిరి, ష‌న్నూలు చాలా సేపు చ‌ర్చించి.. స‌న్నీ గేమ్ ను డిస్ట్రాబ్ చేయాల‌ని త‌న ఫ్లాన్ ను అమలు ప‌రిచారు. ప్లాన్లో భాగానే స‌న్నీ క్లోజ్ ప్రెండ్ మానస్ ని ఎంపిక చేశారు. ఈ టాస్కులో స్విమ్మింగ్ పూల్ లో స్మిమ్ చేస్తూ అవతల ఉన్న టీషర్ట్స్ ని ధరించి.. మళ్లీ తిరిగి స్టార్టింగ్ పాయింట్ కి రావాలి. ఇలా.. ఎవరు ఎక్కువ టీషర్ట్స్ ధరిస్తే వాళ్లు విజేత అవుతారు. దీంతో ఈ టాస్క్ సన్నీ వర్సెస్ మానస్ గా మారిపోయింది. ఈ టాస్కులో వీరిద్ద‌రి ఇన్వాల్వ్ మెంట్ చాలా బాగుంది. ఇద్ద‌రూ కూడా స‌మ ఉజ్జీలు కాబట్టి.. హౌస్ మేట్స్ కే కాకుండా ఆడియన్స్ లో కూడా ఆసక్తిని రేకెత్తించారు.

ఈ టాస్కులో సంచాలక్ గా ఉన్న రవి త‌న గేమ్ స్ట్రాట‌జీని అమ‌లు ప‌రిచాడు. రెండు మూడు టీషర్ట్స్ ధరించిన తర్వాత మధ్యలో టీషర్ట్స్ ప్రోపర్ గా వేసుకోవాల‌ని రూల్ పెట్టాడు. ఈ క్ర‌మంలో ష‌న్ను కూడా కొత్త రూల్స్ చేప్పిన‌ట్టు అనిపించింది. స‌న్నీ వేసుకున్న టీ ష‌ర్స్ స‌రిగ్గా వేసుకోలేద‌ని తెలిపారు.
ఈ మాటాల‌తో సన్నీకి ఒళ్లు మండింది. కొన్ని టీష‌ర్టుల‌ను లేబుల్ కనిపించడం లేదని, అలాంటప్పుడూ టీష‌ర్ట్ రివర్స్ ఉన్నాయో? లేవో? ఎలా తెలుస్తోందని వాదనకి దిగాడు. అస‌లు ఇలాంటి రూల్ చెప్ప‌లేద‌నీ, మధ్యలో చెప్తే ఎలా అంటూ రవిని నిలదీశాడు.

ప్రతి టాస్కులో త‌న‌నే టార్గెట్ చేస్తున్నార‌నీ, టాస్క్ ఆడాలన్న మూడ్ పోయిందని అప్సెట్ అయ్యాడు స‌న్నీ. ఈ క్ర‌మంలో కాజల్, మాన‌స్ లు సన్నీకి ఎక్స్ ప్లయిన్ చేసే ప్రయత్నం చేశారు. అయినా కూడా సన్నీ ఏ మాత్రం వినిపించుకోలేదు. పైగా వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సంచాలక్ నిర్ణయాన్ని ఒప్పుకుంటాన‌నీ, కానీ..త‌న‌కు మాత్రం అన్యాయం జరిగిందని వాపోయాడు.

నిజంగా .. ర‌వి కావాల‌నే స‌న్నీని టార్గెట్ చేశాడా? అనేలా ప్ర‌వ‌ర్తించాడు. ఇలా ప్ర‌వ‌ర్తించడానికి కార‌ణం లేక‌పోలేదు. గ‌త వారం వీరిద్ద‌రి మ‌ధ్య ఓ చిన్న వాగ్వాదం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో రవి .. సన్నీ బిహేవియర్ గురించి కొంచెం తేడాగానే మాట్లాడాడు. దీంతో స‌న్నీ నెక్ట్స్ జ‌రిగిన టాస్కులో రవిని ఫేక్ అంటూ బోర్డ్ తగిలించాడు. అప్ప‌టి నుంచి..వీరిద్ద‌రి మ‌ధ్య కోల్డ్ వార్ జ‌రుగుతూనే ఉంది. ఇప్పుడు సంచాలక్ గా రవి తీస్కున్న నిర్ణయాన్ని తప్పుబట్టాడు సన్నీ.

ఇదిలా ఉంటే.. నెట్టింట్లో కూడా రవి కావాలనే సన్నీని టార్గెట్ చేశాడని, అందుకే టాస్క్ మధ్యలో కొత్త రూల్ పెట్టాడ‌ని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సన్నీ ఫ్యాన్స్ ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ని తెగ షేర్లు చేస్తున్నారు. అంతేకాదు, ర‌వి, ష‌న్నూ, సిరిలు క‌లిసి గేమ్ మ‌ధ్య‌లో కొత్త రూల్స్ పెట్టార‌ని కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.

Read more RELATED
Recommended to you

Latest news