బిగ్ బాస్: గీతూ భర్త ఎవరు? ఏమి చేస్తుంటారంటే..?

-

గీతూ రాయల్.. బిగ్ బాస్ హౌస్లో గీతూ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హౌస్ మొత్తం ఒకటే అంటే తను మాత్రం మరొకటి అంటుంది. హౌస్ లో వాళ్లందరికీ చుక్కలు చూపిస్తోంది.. ఇక చిత్తూరు యాస మాట్లాడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న గీతూ హౌస్ మేట్స్ కి మాత్రం తలనొప్పిగా మారుతుంది. ఎలాంటి దాపరికం లేకుండా మనసులో మాటలను నిర్మొహమాటంగా బయట పెడుతూ అభిమానులను కూడా సొంతం చేసుకుంటోంది. ఇకపోతే తన ముక్కు సూటితనంతో ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ తనదైన ఆటతీరుతో హౌస్ మేట్స్ కి చెమటలు పట్టిస్తోంది. తన యాస , మాటలు, గొడవలు, వివాదాలు ఇలా హౌస్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది.

ఇకపోతే టాస్కుల్లో సైతం అబ్బాయిలకు గట్టి పోటీ ఇస్తుంది. విభిన్న వ్యవహార శైలితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న గీతూ ది ప్రేమ వివాహము అని అందరికీ తెలిసిందే. ఇంకా గత ఏడాది ఫిబ్రవరిలో వికాస్ అనే తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. ఇక ఈమె భర్త వికాస్ తమిళ నేపథ్య కుటుంబానికి చెందినవాడు. ఇక అతను ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోని వికాస్ ఇటీవల యూట్యూబ్ ఛానల్ తో కూడా ముచ్చటించాడు. ఇక ఈ సందర్భంగా తన భార్య గీతూ ఆట గురించి స్పందిస్తూ .. గీతూ ఆట తనకు చాగా బాగా నచ్చిందని , తను చాలా బాగా అడుతూ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోందని తెలిపాడు.

అంతేకాదు తన భార్యను అలా టీవీలో చూడడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. అయితే గీతూ తన పక్కన లేకపోవడంతో తనని మిస్ అవుతున్నాననే భావన కలుగుతుందని తెలిపాడు. అంతేకాదు పెళ్లయినప్పటి నుంచి గీతూ దూరంగా ఉండడం ఇదే మొదటిసారి అని తెలిపాడు.. ఇకపోతే తన భార్య మాట తీరు గురించి మాట్లాడుతూ.. తన వాయిస్ పెద్దదిగా ఉండడం వల్ల రూడ్ గా మాట్లాడినట్లు ఉంటుంది. కానీ తను మృదుస్వభావి.. పలకరింపులో కూడా సాఫ్ట్ నెస్ ఉండదు .. హౌస్ లో గీతూ నటించడం లేదు. సహజంగా ఆమె ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు వికాస్.

Read more RELATED
Recommended to you

Latest news