నటుడు మిథున్‌ చక్రవర్తికి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

-

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, బీజేపీ నేత మిథున్‌ చక్రవర్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ సినిమా షూటింగులో ఉన్న ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం ఆయనను కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మిథున్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన 73 ఏళ్ల మిథున్‌ చక్రవర్తి గత కొన్ని దశాబ్దాలుగా బాలీవుడ్‌లో రాణిస్తున్న విషయం తెలిసిందే. 1982లో వచ్చిన ‘డిస్కో డ్యాన్సర్‌’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. బెంగాలీ, హిందీ, ఒడిశా, భోజ్‌పురి, తమిళ్‌, కన్నడ, పంజాబీలో దాదాపు 350 సినిమాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులకూ మిథున్ తెలిసినవాడే. ‘గోపాల గోపాల’ చిత్రంలో స్వామీజీగా నటించి ఆకట్టుకున్నారు. రాజకీయాలపై ఆసక్తితో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరి 2014లో రాజ్యసభకు వెళ్లారు. రెండేళ్లకే ఆ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇటీవలే ఆయనను కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్‌’ పురస్కారంతో సత్కరించింది

Read more RELATED
Recommended to you

Latest news