షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన బాలీవుడ్ బ్లాక్బస్టర్ జవాన్, ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో!

-

హైదరాబాద్, 13 మార్చి 2024: వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్ జీ తెలుగు. ఈ వారం బాలీవుడ్ బ్లాక్బస్టర్ సినిమా జవాన్ను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా అందించేందుకు సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో గౌరీఖాన్ నిర్మించిన ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. బాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్, మార్చి 17 ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో!

అన్యాయానికి వ్యతిరేకంగా జరిగే పోరాటమే ఇతివృత్తంగా రూపొందిన సినిమా జవాన్. ఈ సినిమా కథ సమాజంలోని దురాచారాలను ఎదుర్కోవడానికి విషయాలను తన చేతుల్లోకి తీసుకునే భారతీయ సైనికుడు షారుఖ్ ఖాన్ పోషించిన విక్రమ్ రాథోడ్ చుట్టూ తిరుగుతుంది. సబ్వే రైలును తన ఆధీనంలోకి తీసుకొని, ఆయుధ వ్యాపారి ఖాలీ గైక్వాడ్కు వ్యతిరేకంగా చేసే న్యాయపోరాటం ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. ఈ సినిమాలో నయనతార ఎన్ఎస్జీ ఆఫీసర్ నర్మద పాత్రలో నటించారు.

జవాన్ సినిమా భావోద్వేగాలతో కూడిన తండ్రీకొడుకుల కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనిరుధ్ రవిచందర్ ఎనర్జిటిక్ మ్యూజిక్, షారుఖ్ ఖాన్, విజయ్ సేతుపతి, నయనతార, దీపికా పదుకొణె, ప్రియమణి, సన్యా మల్హోత్రా, రిధి డోగ్రా, లెహర్ ఖాన్, సునీల్ గ్రోవర్, గిరిజా ఓక్ వంటి ప్రముఖ నటీనటుల అద్భుతమైన నటనతో రూపొందిన ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు జీ తెలుగు వేదికగా ప్రసారం కానుంది, తప్పక చూడండి!

బాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్, ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో!

Read more RELATED
Recommended to you

Latest news