ఈ నెల 15 న ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

-

ముస్లింల పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మార్చ్ 15వ తేదీన ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించాయి. ఈ ఇఫ్తార్ విందుకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అంతే కాకుండా రాష్ట్ర కేబినెట్ మినిస్టర్స్ ,ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు ,ఎంపీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన నిర్వాణ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సంబంధిత అధికారులతో కలిసి ఇవ్వాల పరిశీలించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ….. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చ్ 15 ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్న సందర్భంగా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news