BREAKING : బాలీవుడ్ డైరెక్టర్ ప్రదీప్ మృతి

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.

బాలీవుడ్ డైరెక్టర్ ప్రదీప్ సర్కార్ (67) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రదీప్ ఈరోజు తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన బంధువు, నటి నీతు చంద్ర శ్రీవాత్సవ వెల్లడించారు. హెలికాప్టర్ ఈలా, పరిణీత, మార్ధాని మొదలైన చిత్రాలు తీసి గుర్తింపు పొందారు ప్రదీప్. పలు మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా డైరెక్ట్ చేశారు. ప్రదీప్ మృతిపై ప్రముఖులు సంతాపం తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news