ఆర్ఆర్ఆర్ కి బాలీవుడ్ ఫిదా అయిపోయింది…!

-

సినిమా తీస్తే పది కాలాల పాటు గుర్తుండాలి. రాజమౌళి ఫాలో అయ్యే సిద్దాంతం ఇదే. అతను తీసిన ఏ సినిమా అయినా సరే ఇలాగే ఉంటుంది. మొదటి సినిమా నుంచి ప్రస్తుతం చేసే ఆర్ఆర్ఆర్ వరకు కూడా ఇదే సిద్దాంతం. ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో అతను తీసుకునే జాగ్రత్తలు అన్నీ కూడా అభిమానులతో పాటు సిని విశ్లేషకులను కూడా షాక్ కి గురి చేస్తున్నాయి. మల్టీ స్టారర్ సినిమా తీస్తున్నాడు రాజమౌళి.

టాలీవుడ్ లో ఈ సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. మెగా నందమూరి ఫ్యామిలీలను కలిపి ఈ సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా ఈ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఆర్ఆర్ఆర్ టీజర్ ఒకటి విడుదల చేసారు. ఈ టీజర్ లో ఎన్టీఆర్… రామ్ చరణ్ గురించి చెప్తూ ఉంటాడు. బాలీవుడ్ లో ఎవరూ కూడా ఇలా ఒక స్టార్ హీరో… మరో స్టార్ హీరోని పొగిడే అవకాశం ఉండదు.

అది సినిమాలో అయినా మరొక చోట అయినా సరే. అలాంటిది ఈ సినిమాలో రామ్ చరణ్ గురించి ఎన్టీఆర్ చెప్తున్నాడు. దీన్ని చూసి బాలీవుడ్ ఫిదా అయిపోయింది అంటున్నారు. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఎన్ని సినిమాలు ఉన్నా సరే ఈ సినిమా కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. చిరంజీవి సినిమాకు కూడా ఈ స్థాయిలో క్రేజ్ లేదు ఇప్పుడు. ఏది ఎలా ఉన్నా సరే ఈ సినిమా చరిత్ర సృష్టించడం ఖాయమని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news