బ్రేకింగ్ : సూర్య ఆఫీస్‌కి బాంబు బెదిరింపు

-

గ‌త కొన్ని రోజులుగా త‌మిళ హీరోలకు బాంబు బెదిరింపులు స‌ర్వ‌సాధారణంగా మారిపోయాయి. ఆకతాయిలు వ‌రుస బాంబు బెదిరింపు కాల్స్‌తో త‌మిళ హీరోల‌ని బెంబేలెత్తిస్తున్నారు. హీరోల ఇళ్ల‌తో పాటు ఆఫీస్‌ల‌కు బాంబులు పెట్టామంటూ కాల్స్ చేయ‌డం త‌మిళ‌నాట తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. తాజాగా హీరో సూర్య ఆఫీస్‌కి బాంబ్ పెట్టామంటూ ఫోన్ రావ‌డం క‌ల‌క‌లం రేపింది.


వ‌రుస వివాదాల్లో చిక్కుకున్న సూర్య ఆఫీస్‌కి బాంబు బెదిరింపు కాల్ రావ‌డంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు చెన్నైలోని అల్వార్ పేట‌లో వున్న సూర్య ఆఫీస్‌కి వెళ్లి క్షుణ్ణంగా ప‌రిశీలించారు. ఎక్క‌డా ఎలాంటి బాంబు క‌నిపించ‌క‌పోవ‌డంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు ఇది ఫేక్ కాల్ అని గుర్తించి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. గ‌తంలో ఇలాంటి ఫేక్ బాంబు బుదిరింపు కాల్స్ విజ‌య్‌, ర‌జ‌నీకాంత్‌, మ‌ణిర‌త్నం, అజిత్ ల‌కు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version