బోయపాటి శ్రీను మూవీ కొత్త విలన్ గా ప్రిన్స్!

బోయ పాటి అంటే బాలయ్య బాబు కు గురి ఎక్కువ.అలాగే  బాలయ్య ఫ్యాన్స్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా అంటే చాలు కచ్ఛితంగా హిట్ అని లెక్క వేసుకుంటారు.బాలకృష్ణ మరియు బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహా మరియు లెజెండ్ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో వీరి కాంబోలో మూడవ సినిమా గా అఖండ  అంచనాలకు తగ్గట్లుగా అఖండ సినిమా బాలయ్య అభిమానులను మాత్రమే కాకుండా ప్రేక్షకులను కూడా సంతృప్తి పర్చడంతో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక విలన్ పాత్ర ఎంతగా హైలైట్ అయితే హీరో పాత్ర అంతగా హైలైట్ అని నమ్మే బోయపాటి శ్రీను కొత్త కొత్త గా విలన్ల ను వెతికి పట్టుకొని మారి వారిని ఫేమస్ గా మారుస్తారు. జగపతి బాబుకి బోయపాటి ఇచ్చిన బూస్ట్ అతని కెరియర్ ను సూపర్ హిట్ చేసింది. ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో, ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న చిత్రం కోసం కూడా మంచి విలన్ ను పట్టాడు.

అప్పట్లో చిన్న హీరో వేషాలు వేసిన ప్రిన్స్ బోయపాటి శ్రీను సినిమా లో విలన్ గా చేస్తున్నారు. ఇక హీరో రామ్, బోయపాటి సినిమాలో ప్రిన్స్ రోల్ సినిమాకు హైలెట్ కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.