వాలెంటైన్స్ డే రోజు ఆ రొమాంటిక్ టచ్ ఉంటేనే మజా వస్తుంది..!!

-

ప్రేమ అనేది రెండు మనసుల కలయిక.. ఒక తియ్యని అనుభూతి ప్రేమనుకు ఎంతగా ప్రేమిస్తామో అంతగా ఆ ప్రేమ మనల్ని ప్రేమిస్తుంది అని ప్రేమికుల నమ్మకం.ఒక మనిషిని ప్రేమించడం అంటే ప్రాణాలను అర్పించడం అని ప్రేమికులు అంటుంటారు. అది నిజమే అని కవులు కూడా అంటున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రేమ ఒక మైకం అని రోజులు పోయే కొద్దీ ప్రేమ అనేది మరింత ఎక్కువగా ఉంటుంది… ఒకప్పుడు ప్రేమ అనేది కేవలం కలిసి తిరగడమే కాకుండా కల్యాణ వేదిక వరకు వెళ్లి వివాహ బంధంతో ఒకటై కుటుంబాన్ని ఏర్పరచుకొని వారు. కానీ ఈ మధ్య కాలంలో ప్రేమ అనేది కేవలం పబ్బులలో తిరగటానికి, పదిమందికి గొప్పగా చెప్పుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. పెళ్లి వరకు అతి కొద్దీ మంది మాత్రమే వెళ్తున్నారు…

 

ఫిబ్రవరి వచ్చిందంటే ప్రేమికులకు ఎక్కడలేని సంతోషం తో ఉంటారు.. అదేనండి వాలంటైన్స్ డే ఈ నెలలోనే వస్తుంది కదా.. ప్రేమికులందరూ తమ భావాలను తాము ప్రేమించిన వ్యక్తికి తెలియజేయడానికి ఆరోజు కోసం ఆత్రుతగా కూర్చుంటారు..ఫిబ్రవరి 14న వచ్చే వాలెంటైన్స్ డే, స్థిరంగా ప్రేమికుల వారానికి ముందు ఉంటుంది. వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమవుతుంది.. ఇది ఫిబ్రవరి 14న ఆఖరి అత్యంత ముఖ్యమైన వాలెంటైన్స్ డే వరకు రోజ్ డేగా జరుపుకుంటారు. ఈ వారం, ఏడవ తేదీ నుండి పద్నాలుగో వరకు ప్రేమ వారం, ప్రేమికుల వారం లేదా శృంగార వారం అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం, వాలెంటైన్స్ వారం మంగళవారం ప్రారంభమవుతుంది..

ప్రేమికుల రోజును ఎలా జరుపుకుంటారు, అసలు ఈరోజు ప్రత్యేకత ఏంటి అనే విషయం చాలామందికి తెలియదు.. తెలిసిన చేసేదేమి లేదు.. కానీ ఈరోజు రొటీన్ గా కాకుండా వెరైటీగా మాట్లాడుకుందాం.. అదేనండి రొమాన్స్ గురించి.. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో విధంగా రొమాన్స్ జరుగుతుంది.. అది తప్పో ఒప్పో చేస్తారు… అయితే నిజమైన ప్రేమికుల కోసం ఓ చిన్న మాట..ఈరోజు మీ లవర్ కు గుర్తుండి పోవాలంటే చెయ్యాల్సింది లవర్స్ డే సెలెబ్రేషన్స్ కాదు.. తన మీద మీకున్న ప్రేమను.. గట్టిగా మనస్ఫూర్తిగా ఒక హాగ్, వీలైతే నుదుటి మీద ఒక కిస్ చెయ్యండి చాలు.. మీకు పడిపోతారు.. ఈ రొమాంటిక్ టచ్ కోట్లు పెట్టి ఇది చేసినా దొరకదు.. ఒక కౌగిలి ఓదార్పు, ఒక ముద్దు ప్రేమకు గుర్తు..ఇది మర్చిపోకండి.. హ్యాపీ వాలంటైన్స్ డే..

Read more RELATED
Recommended to you

Latest news