ఆమె మాయలో స్టార్ డైరక్టర్

172

తెలుగు క్రేజీయెస్ట్ డైరక్టర్ బోయపాటి శ్రీను స్టార్ హీరోయిన్ కేథరిన్ మాయలో పడ్డాడా అంటే అవుననే అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాల వారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమలైతే చేస్తున్నా అందుకు తగిన క్రేజ్ తెచ్చుకోవడంలో విఫలమైన కేథరిన్ త్రెసా అంటే బోయపాటి శ్రీను స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. అల్లు అర్జున్ సరైనోడు సినిమాలో కేథరిన్ త్రెస సెకండ్ హీరోయిన్ గా నటించింది.

ఆ తర్వాత బోయపాటి డైరెక్ట్ చేసిన జయ జానకి నాయక సినిమాలో కూడా కేథరిన్ ను ఓ స్పెషల్ సాంగ్ లో తీసుకున్నాడు. ఇప్పుడు రాం చరణ్ వినయ విధేయ రామ కోసం కూడా కేథరిన్ తో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశాడట బోయపాటి శ్రీను. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఈ ఐటం సాంగ్ లో కేథరిన్ త్రెసా అదరగొట్టేస్తుందని అంటున్నారు.

ఈమధ్య రిలీజైన సినిమా టీజర్ అదరగొట్టగా 2019 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న వినయ విధేయ రామతో రంగస్థలం రికార్డులను కొనసాగించాలని చూస్తున్నాడు రాం చరణ్.