బన్ని కాదు నాని ఫిక్స్ అయ్యాడు

-

నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ విక్రం కుమార్ డైరక్షన్ లో మూవీ చేస్తాడని టాక్ వచ్చింది. కథ నచ్చినా నరేషన్ నచ్చకపోవడంతో విక్రం కుమార్ సినిమా వదిలేశాడు బన్ని. అల్లు అర్జున్ సినిమా ఉంటుందని ఆశించిన విక్రం కుమార్ ఆ ఛాన్స్ మిస్సైందని నాచురల్ స్టార్ నానితో సినిమా లైన్ చేస్తున్నాడట. ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకోవడంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

నాని ప్రస్తుతం జెర్సీ సినిమా చేస్తున్నాడు ఆ సినిమా తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా డిస్కషన్స్ లో ఉంది. విక్రం కుమార్ కు నాని ఆల్రెడీ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ కాంబినేషన్ కు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ బయటకు రానుంది. ఈ ఇయర్ కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలు రెండు డిజప్పాయింట్ చేయడంతో ఈసారి నాని స్క్రిప్ట్ మీద మరింత జాగ్రత్త పడుతున్నాడు.

జెర్సీ సినిమా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. డబుల్ హ్యాట్రిక్ సినిమాలతో ఫాం లో ఉన్న నాని స్పీడ్ కు రెండు సినిమాలు బ్రేక్ వేయగా రాబోతున్న జెర్సీ అయినా అతన్ని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news