మెగా ఫ్యామిలీ కామెంట్స్ పై రోజాకు షాక్ ట్వీట్ షేర్ చేసిన బ్రహ్మాజీ..!!

-

గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి ఎక్కువగా జబర్దస్త్ కమెడియన్.. మంత్రి , నటి రోజా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. మంత్రి రోజా మెగా కుటుంబం పై.. మాట్లాడుతూ మెగా కుటుంబంలో ఆరేడు మంది హీరోలు ఉన్నారని అందుకే చిన్న ఆర్టిస్టులు భయపడి వారికి మద్దతు ఇస్తున్నారు అంటూ చేసిన కామెంట్లపై సోషల్ మీడియా వేదికగా నటుడు బ్రహ్మాజీ కౌంటర్ ఇవ్వడం జరిగింది. నన్ను ఎప్పుడు మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్ చేయమని కానీ… పార్టీలో చేరమని కానీ అడగలేదు. చిన్న ఆర్టిస్టులే కదా అంత భయపడతారు ఎందుకు? అని ట్విట్టర్లో మంత్రి రోజాను ప్రశ్నిస్తున్నారు నటుడు బ్రహ్మాజీ.

ప్రస్తుతం బ్రహ్మాజీ షేర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.. దీంతో కొంతమంది మెగా అభిమానులు మీ నుంచి ఇలాంటి ట్విట్ ను ఊహించలేదు అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మెగా కుటుంబం పైన రోజా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. చిరంజీవి కుటుంబానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావు.. ఇండస్ట్రీలో లేకుండా చేస్తారని భయంతో ఇలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు తప్ప ప్రేమ లేదు అని.. ఒకవేళ ప్రేమ అంతగా ఉంటే ప్రకాష్ రాజ్ ను మా ఎన్నికలలో ఎందుకు సపోర్ట్ చేయలేదని.. ఎందుకు గెలవలేదని రోజా మాట్లాడడం జరిగింది.

ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం జరిగిన జనసేన యువశక్తి సభలో హైపర్ ఆది రోజాతో సహా కొంతమంది మంత్రులపైన తనదైన స్టైల్ లో పంచులు వేయడం జరిగింది. ఇక అప్పటినుంచి ఈ వార్ మొదలవుతూనే ఉంది. ఇక గతంలో కూడా ఒకసారి గెటప్ శ్రీను కూడా డైరెక్ట్ గా మెగా ఫ్యామిలీ పై రోజా చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టడం జరిగింది. ప్రస్తుతం బ్రహ్మాజీ షేర్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news