బ్ర‌హ్మాజీ ట్విట్ట‌ర్ అకౌంట్‌కి ఏమైంది?

-

 

హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల‌పై బ్ర‌హ్మాజీ వేసిన ట్వీట్ వివాదానికి దారి తీసిన విష‌యం తెలిసిందే. అత‌న్ని ఫాలో చేసే వారే ఆయ‌న‌ని ట్రోల్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల కార‌ణంగా హైద‌రాబాద్ న‌గ‌రం వ‌ర‌ద‌ల్లో చిక్కుకుంది. చాలా వ‌ర‌కు ఏరియాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ప్ర‌తీ ఒక్క‌రి ఇళ్ల‌ల్లోకి వ‌ర‌ద నీరు చేర‌డంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులకు గుర‌య్యారు.

ఈ వ‌ర‌ద‌ల్లో త‌ను కూడా చిక్కుకున్నాన‌ని, త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లోనూ వ‌ర‌ద నిండిపోయింద‌ని బ్ర‌హ్మాజీ ట్వీట్ చేశారు. ఇదీ నా ఇంటి ప‌రిస్థితి. హైద‌రాబాద్ ఫ్ల‌డ్స్ కార‌ణంగా బోట్ కొనాల‌నుకుంటున్నాను. ద‌య‌చేసి తెలిసిన వాళ్లు స‌ల‌హా ఇవ్వండి` అంటూ బ్ర‌హ్మాజీ సోష‌ల్ మీడియా వేదిక‌గా కొన్ని ఫొటోల‌ని షేర్ చేశారు. దీనిపై మండి ప‌డిన నెటిజ‌న్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

కామెడీ చేయాల‌ని ట్రై చేసి బ్ర‌హ్మాజీ ట్రోలింగ్‌కి గుర‌య్యారు. దీంతో ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌ని డియాక్టివేట్ చేశారు. దీంతో నెటిజ‌న్స్‌, ఆయ‌న ఫాలోవ‌ర్స్ షాక‌వుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ట్విట్ట‌ర్ అకౌంట్ డీయాక్టివేట్ కావ‌డంతో బ్ర‌హ్మాజీ ట్విట్ట‌ర్ లౌంట్‌కు ఏమైందంటూ చ‌ర్చ‌మొద‌లైంది. ప్ర‌స్తుత హీట్ త‌గ్గాక మ‌ళ్లీ రీయాక్టివేట్ చేయాల‌ని బ్ర‌హ్మాజీ భావిస్తున్నార‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news