BREAKING:బాహుబలి కట్టప్ప ఇంట విషాదం..!

-

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ చిత్రం బాహుబలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ముఖ్యంగా ఈ సినిమాలో కట్టప్ప పాత్ర సినిమాకి హైలైట్ గా నిలిచింది. కట్టప్ప పాత్ర లేనిదే సినిమాను ముందుకు తీసుకెళ్లడం కష్టం అనేంతలా సినిమాను ఆయన ఒంటి చేత్తో నడిపించారు. అలా భారీ పాపులారిటీ దక్కించుకున్న కట్టప్ప పాత్రలో ప్రముఖ కోలీవుడ్ నటుడు సత్యరాజ్ అద్భుతంగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నటుడు సత్యరాజ్ ఇంట తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. ఆయన తల్లి నతంబాల్ (94) వయోభారరీత్యా కోయంబత్తూర్ లోని తన స్వగృహంలో కళ్ళు మూసినట్లు తాజాగా కుటుంబ సభ్యులు వెల్లడించారు.

దీంతో సత్యరాజ్ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన తల్లి మరణ వార్త విన్న వెంటనే హైదరాబాదులో షూటింగ్ చేస్తున్న సత్యరాజ్ వెంటనే కోయంబత్తూర్ కి చేరుకున్నారు. నతంబాల్ కి ముగ్గురు పిల్లలు.. అందులో అబ్బాయి సత్య రాజ్ కాగా అమ్మాయిలు కల్పన, రూప. సత్య రాజుకు తన తల్లి అంటే ఎంతో ప్రాణం.. ఆమెకు తాను నటించిన సినిమాలంటే ఎంతో ఇష్టమని ఆయన ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు ఇకపోతే తల్లి మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్న సత్యరాజ్ ను పలువురు ఇండస్ట్రీ పెద్దలు ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక సత్యరాజ్ తల్లి మృతి పై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా కోలీవుడ్ నటుడు ఎమ్మెల్యే అయిన ఉదయనిధి స్టాలిన్ కూడా ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ఇక సత్యరాజ్ ఎక్కువగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో నటించగా ఆయన కొడుకు శివ సత్యరాజ్ కూడా కోలీవుడ్ లో హీరోగా సెటిల్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news